క్షమాపణలు కోరిన దుల్కర్ సల్మాన్…

సీనీ పరిశ్రమలోకి ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా పరిచయం అయ్యాడు. తెలుగు లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ మూవీలో జెమిని గణేషన్ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించాడు. తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటిస్తున్న దుల్కర్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టాడు. ఇక ఈ మద్య బాడీ షేమింగ్ గురించి తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నారు. శరీరం గురించి వెకిలి వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

పర్సనాలిటి ని బ్లేబ్ చేస్తూ వ్యంగమైన మాటలు మాట్లాడినా.. చూపించినా వారిపై చర్యలు తీసుకుంటున్నారు.తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ నటించిన `వారనె అవశ్యముండ్` సినిమాలో ఇలాంటిదే ఒక విషయం గురించి ముంబైకి చెందిన రిపోర్టర్ చేతనా కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూవీలో తన అనుమతి లేకుండా ఫోటో ఉపయోగించారని ఆరోపించారు. ఈ మూవీలో బరువు తగ్గించే క్లినిక్ కోసం పోస్టర్‌లో కనిపిస్తాయి. ఈ సినిమాలో తన ఫొటోను అవమానకరంగా ఉపయోగించారని, అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని, సినిమా నుంచి తన ఫొటోను తొలగించాలని లేదా బ్లర్ చేయాలని హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడిని ట్యాగ్ చేస్తూ చేతన ట్వీట్ చేశారు.ఈ చిత్ర బృందంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెట్నా కపూర్ ఒక ట్వీట్‌లో రాశారు.

తాజాగా దీనిపై స్పందించిన హీరో దుల్కర్ సల్మాన్.. `దీనికి మేం పూర్తి బాధ్యత వహిస్తున్నాం. ఇది ఎలా జరిగిందో నేను తెలసుకుంటాను. మీ ఫొటోను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కనుక్కుంటాను. నా తరఫున, మా చిత్రబృందం తరఫున నేను క్షమాపణలు చెబతున్నాను` అంటూ దుల్కర్ రిప్లై ఇచ్చాడు. అంతే కాదు ఈ మూవీ దర్శకుడు సైతం క్షమాపణలు చెప్పారు.