దూసుకెళ్తున్న పసిడి.. ఒక్క గ్రాము బంగారం రేటెంతో తెలిస్తే షాకే..?

బంగారం ధర పరిగెడితే వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.1,150 తగ్గుదలతో రూ.43,000కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం పరుగులు పెడుతూనే ఉంది. పసిడి ధర ఔన్స్‌కు 0.77 శాతం పెరుగుదలతో 1,528.85 డాలర్లకు చేరింది.

అలాగే వెండి ధర ఔన్స్‌కు 1.62 శాతం పెరుగుదలతో 17.34 డాలర్లకు ఎగసింది.ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 పెరుగుదలతో రూ.38,470కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 పెరుగుదలతో రూ.38,300కు ఎగసింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.28,600 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బంగారం ధర శనివారం రూ.90 పెరుగుదలతో రూ.38,420కు చేరింది.కేజీ వెండి ధర రూ.1,150 తగ్గుదలతో రూ.43,000కు తగ్గితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర మాత్రం స్థిరంగా రూ.43,324 వద్ద ఉంది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.88,000 వద్ద, అమ్మకం ధర రూ.89,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.37,830కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.36,030కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.47,600 వద్దకు ఎగసింది.