సరిలేరు లో స్పేషల్ గెస్ట్ ఏవరో తేలుసా.?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు అన్ని పనులు ముగించుకుని జనవరి 11న రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాతో మహేష్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు పాతర వేయడం ఖాయమని అంటున్నారు సినీ వర్గాలు.ఇక ఈ సినిమాలో అనేక సర్‌ప్రైజ్‌లు ఉన్నాయంటూ చిత్ర యూనిట్ డప్పు కొడుతూ వస్తున్నాయి.కానీ అన్నింటికన్నా ఎవ్వరూ ఊహించని సర్‌ప్రైజ్ ఒకటి ఉందని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు.

 

ఈ సినిమాలో 30 నిమిషాల ట్రెయిన్ సీక్వెన్స్ ఉంటుందని, అది సినిమాకే హైలైట్ కానుందనే విషయం అందరికీ తెలిసిందే.ఈ ట్రెయిన్ సీక్వెన్స్‌లో భాగంగా ఎవ్వరూ ఊహించని విధంగా సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించి ఒక స్పెషల్ సర్‌ప్రైజ్‌ను చిత్ర యూనిట్ అందిస్తారట.అయితే ఇందులో సూపర్ స్టార్ కృష్ణ స్వయంగా కనిపిస్తారా? లేక కృష్ణకు సంబంధించి ఏదైనా సీన్ ఉంటుందా అనేది మాత్రం సస్పెన్స్‌గా పెట్టారు దర్శకుడు.మరి ఈ అరగంటలో వచ్చే ఆ సర్‌ప్రైజ్ ఏమిటో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోండగా రష్మిక మందన హీరోయిన్‌గా, ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.