లవర్ తో అడ్డంగా దొరికిపోయిన యంగ్ హీరోయిన్.. ఇక పుకార్లకు చెక్

సోషల్ మీడియాకు హాట్ హాట్ అందాలతో సెగలు పుట్టించే దిశా పటాని.. తాజాగా తన ప్రియుడితో దొరికి అడ్డంగా బుక్కయింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగిస్తోంది దిశా. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ ఇద్దరూ డేటింగ్ లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి కెమెరాకు చిక్కారు. వివరాల్లోకి పోతే..పలు కార్యక్రమాలకు సైతం జంటగా వచ్చి ఎన్నోసార్లు మీడియాకు చిక్కిన ఈ జంట ఇటీవలి కాలంలో విడిపోయిందనే వార్తలు వచ్చాయి.

కానీ తమ ప్రేమ వ్యవహారం, డేటింగ్ సంగతుల గురించి ఇప్పటిదాకా ఈ జంట స్పందించిన సందర్భాలు లేవు. అయితే తాజాగా మరోసారి ఈ జంట పబ్లిక్ గా కనిపించడం, పైగా సెక్సీ లుక్‌లో దిశా ఉండటం చూసి షాకవుతున్నారు నెటిజన్లు. ప్రియురాలిని ఎలా వాడాలో అతనికి బాగా తెలుసని కామెంట్ చేస్తున్నారు.నిజానికి పెళ్లి చేసుకొని ఒక్కటవుదామని నిర్ణయించుకున్న ఈ జంటకు టైగర్ ష్రాఫ్ తల్లి అడ్డు చెప్పిందని, ఈ మేరకు తమ రిలేషన్ షిప్ విషయమై పూర్తి క్లారిటీకి వచ్చేశారని వార్తలు వచ్చాయి. దిశా పటానీ- టైగర్ ష్రాఫ్ ఇద్దరూ బ్రేకప్ అయ్యారని, ఇకపై స్నేహితులుగా ఉండాలనే నిర్ణయానికి వచ్చేశారని వారిద్దరి సన్నిహితులు లీక్ చేశారు. దీంతో అదే నిజమని అనుకున్నారంతా.కానీ తాజాగా మరోసారి తన ప్రియుడు టైగర్ ష్రాఫ్ అడ్డంగా దొరికిపోయింది దిశా పటాని. పైగా ఆమె సెక్సీ డ్రెస్ వేసుకొని, గ్లామర్ లుక్‌లో కనిపించడం.. పక్కనే ఉన్న ప్రియుడు ఆమె చేయి పట్టుకోవడం చూడటంతో వాళ్ళిద్దరి డేటింగ్ వ్యవహారం మరిన్ని చర్చలకు తావిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

పలు ఈవెంట్స్‌లో చెట్టాపట్టాలేసుకు తిరగడంతో దిశా పటానీ- టైగర్ ష్రాఫ్ ఎఫైర్ బయటపడింది. టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణంతో బాగా పాపులర్ అయిన దిషా.. అతనితో కలిసి జాలీగా తిరిగింది. అయితే పెళ్లి విషయం ఎత్తితే మండిపడే వీరు.. తమ మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్‌షిప్ అని ప్రేమ వ్యవహారాన్ని తోసిపుచ్చుతూ వస్తుండటం గమనార్హం.సోషల్ మీడియాలో సెగలు పుట్టించడం దిశా పటానికి వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం ప్యాంట్ విప్పుతూ.. లో దుస్తులను చూపిస్తూ హాట్ ఫోటో షూట్ చేసిన ఆమె, ఇటీవలే మరి కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి మరింత అగ్గి రాజేసింది. ఈ పోస్ట్‌లు చూసిన ఫ్యాన్స్ ఇక ఊరకే ఉంటారా? లైక్స్, షేర్స్ కొడుతూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన దిశా పటాని.. ఆ తర్వాత బాలీవుడ్ గడప తొక్కి అక్కడ భాగీ 2 , ఎంఎస్ ధోని, మలంగ్ లాంటి సినిమాలు చేసింది. ఇటీవలే సల్మాన్‌కి జోడీగా భారత్ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం దిశా పటాని హాట్ ఫోజులకు సోషల్ మీడియాలో మాంచి గిరాకీ ఉంది.