దిశా పటాని హాట్ యాడ్.. ఫ్యాంట్ జిప్ తీసేసి మరీ..

‘లోఫర్’ చిత్రంతో కుర్రకారు మనసు దోచుకున్న నటి దిషా పటానీ. ఆమె ఫిగర్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో చేసింది ఒక్క సినిమానే. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ కూడా ప్రస్తుతానికి రెండు మూడు సినిమాలు చేసింది. కానీ దిషాకు మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఓ స్టార్ నటికి ఉండాల్సిన ఫాలోయింగ్ కంటే ఎక్కువ క్రేజ్ దిషాకు ఉంది. ఇందుకు కారణం ఆమె ఫిగరే. రోజూ జిమ్‌లో కసరత్తులు చేస్తూ జీరో సైజ్ ఫిగర్‌ను మెయింటైన్ చేస్తోంది. సన్నజాజిలాంటి నడుము, యాబ్స్‌తో నిండిన ఫిగర్‌తో ఆమె చాలా అందంగా ఉంటారు.

అందుకే ప్రముఖ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్ కాల్విన్ క్లైన్‌కు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ కొత్త కలెక్షన్ కోసం దిషా ఫొటో షూట్ ఇచ్చారు. ప్యాంట్ జిప్ తెరుస్తూ అందాలు ఆరబోశారు. ఆ సమయంలో తీసిన వీడియోను దిషా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ హాట్ వీడియోను ఇప్పటివరకు 45 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆమె బాడీ ఫిగర్ చాలా సెక్సీగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దిషాకు జిమ్ చేయడమంటే చాలా ఇష్టం. అంతేకాదు ఎంతో క్లిష్టమైన హై జంప్స్, ఫ్లిప్స్ కూడా అలవోకగా చేస్తుంటారు. అందుకే సెక్సీ ఫిగర్ ఆమె సొంతమైంది. హిందీలో ‘ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాతో దిషాకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ‘బాఘి 2’ చిత్రంలో నటించింది. ఇందులో హీరోగా నటించిన టైగర్ ష్రాఫ్‌తో దిషా చాలా కాలంగా డేటింగ్‌లో ఉంది. ఈ విషయాన్ని వారిద్దరూ ఒప్పుకోకపోయినా తరచూ డిన్నర్లకు కారులో కలిసే వెళుతుంటారు.

అంతేకాదు ఆమె రోజూ జిమ్‌కి వెళ్లి కొత్త కసరత్తులు నేర్చకునేది టేగర్ కోసమేనట. టైగర్‌కు కూడా జిమ్ చేసేవారంటే ఇష్టం. అతన్ని ఇంప్రెస్ చేయడానికి ఫ్లిప్స్ చేయడం నేర్చుకున్నానని ఒకానొక సందర్భంలో తెలిపారు. తామిద్దరికీ సిగ్గేనని అందుకే ప్రేమ విషయాన్ని ఎవ్వరూ మీడియా ముందు మాట్లాడలేకపోతున్నామని దిషా తెలిపారు. ప్రస్తుతం దిషా ‘మలంగ్’ సినిమాలో నటిస్తున్నారు.