డైరెక్టర్ కి షాక్ ఇచ్చిన సాయి పల్లవి..ఎం చేసిందంటే…

టాలీవుడ్ లో ఒక్క సినిమాతోనే తానేంటో నిరూపించుకున్న నటీమణులు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. వాస్తవానికి ఒకప్పుడు బుల్లితెరపై సాయి పల్లవి డ్యాన్సర్ గా ఒక్క ఊపు ఊపింది. తన డ్యాన్స్ తెలుగు ప్రేక్షకులను ప్రశంసలు పొందింది.. కానీ ఈ అమ్మడు తర్వాత హీరోయిన్ గా తమకు దర్శనమిస్తుందని ఎవరూ ఊహించలేదు. మాలీవువ్ లో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ చిన్నది తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భానుమతి హైబ్రీడ్ పిల్లా.. ఒక్కతే అంటూ తెలంగాణ యాసలో డైలాగ్స్ తో పిదా చేసింది. తెలుగురాష్ట్ర ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తమిళంలో ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఆ మద్య ధనుష్ నటించిన మారి2 లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. సాయి పల్లవి వ్యక్తిత్వం కూడా చాలా మంచిది అంటారు. ఆ మద్య ఓ యాడ్ కోసం రెండు కోట్లను సున్నితంగాతిరస్కరించింది. యాడ్ వల్ల జనాలను మోసం చేయడం తనకు ఇష్టం లేకపోవడమే దానికి కారణం అని తెలిసిందే. త‌మిళ న‌టుడు సూర్య స‌మ‌ర్ప‌ణ‌లో స‌ముద్ర‌ఖ‌ని, సునైనా, నివేదితా స‌తీష్‌, సారా అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లుగా తెరకెక్కిన మూవీ సిల్లు కరుప‌ట్టి.హ‌లితా ష‌మీం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ గ‌త ఏడాది డిసెంబ‌ర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

తాజాగా ఈ మూవీ సాయి ప‌ల్ల‌వి త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చూసింది. దీనిపై త‌న అభిప్రాయాన్ని ద‌ర్శ‌కురాల‌కి లేఖ ద్వారా తెలియజేసింది సాయి ప‌ల్ల‌వి. చూసి మేము ఎంతో భావోద్వేగానికి గుర‌య్యాం. మీ మూవీతో మాకు మంచి వినోదాన్ని అందించినందుకు ధ‌న్య‌వాదాలు.సాయి ప‌ల్ల‌వి నుండి పాజిటివ్ స్పంద‌న‌ రావ‌డంతో ఉబ్బిత‌బ్బిబ్బిపోయిన ద‌ర్శకురాలు హ‌లితా.. లాక్ డౌన్ న‌న్ను తీవ్ర మాన‌సిక ఒత్తిడికి గురి చేసింది.