చేజేతులా దిల్ రాజు పరువు తీసేసారుగా..? ఇలా అయ్యిందేంటి..?

టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత దిల్ రాజుకు ఓ బ్రాండ్ నేమ్ ఉంది. ఆయ‌న ఏం చేసిన ప‌క్కా ప్లానింగ్‌తో చేస్తాడు. దిల్ రాజు బ్యాన‌ర్లో ఓ సినిమా వ‌చ్చినా… ఆయ‌న ఏదైనా సినిమాను ప్ర‌మోట్ చేసినా.. చివ‌ర‌కు ఆయ‌న ఓ సినిమాను డిస్ట్రిబ్యూష‌న్ చేసినా త‌న‌కు ఎంతో గురి ఉండాలి. ముఖ్యంగా ద‌ర్శ‌కులు, క‌థ మీ గురి ఉంటేనే రాజు ఆ సినిమాల్లోకి ఎంట‌ర్ అవుతాడు. అంతెందుకు రెండేళ్ల క్రితం వ‌ర‌కు దిల్ రాజు సినిమాలు వ‌స్తున్నాయ‌న్నా… చివ‌ర‌కు ఆయ‌న పంపిణీ చేసిన సినిమాలు అన్నా ఎంతో క్రేజ్ ఉండేది.

రాజు సినిమా వ‌స్తుందంటే అటు సినిమా వ‌ర్గాల‌తో పాటు ప్రేక్ష‌కులు, చివ‌ర‌కు బ‌య్య‌ర్ల‌లోనూ అంతే క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు రాజు ఎంచుకునే క‌థ‌లు, తీసే సినిమాలు…. చివ‌ర‌కు డిస్ట్రిబ్యూష‌న్ చేసే సినిమాలు కూడా వ‌రుస పెట్టి డిజాస్ట‌ర్ల మీద డిజాస్ట‌ర్లు అవుతున్నాయి. ఇక తాజాగా రాజు స‌మ‌ర్ప‌ణ అంటూ ర‌విబాబు ఆవిరి సినిమాను ప్రేక్ష‌కుల మీద‌కు వ‌దిలారు. రవిబాబు సినిమా ఆవిరి దర్శకుడిగా ఆవిరైపోయిన రవిబాబు ఐడియాలకి అద్దం పట్టినట్టు అనిపించింది. ఈ చిత్రానికి కనీసం పోస్టర్లు అతికించిన ఖర్చులు కూడా రానంత దారుణంగా ఫ్లాపయింది. చివ‌ర‌కు తొలి రోజు ఆవిరి ఆడుతోన్న థియేట‌ర్ల‌లో తొలి షోకే క‌నీసం 10 శాతం ఆక్యుపెన్సీ కూడా రాలేదు. ర‌విబాబు సినిమాల చ‌రిత్ర‌లోనే ఇంత ఘోర‌మైన సినిమా ఎప్పుడు రాలేదు.

ఇక ర‌విబాబు తీరు మార్చుకోక‌పోతే మ‌రో రాంగోపాల్ వ‌ర్మ మాదిరిగా మిగిలి పోతాడ‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. సురేష్‌బాబుని వదిలేసి దిల్‌ రాజు పేరు జత చేసినా కానీ ఈ ఆవిరి ఆడియన్స్‌కి పట్టలేదు. ఏదేమైనా ర‌విబాబు త‌న సినిమా ప్ర‌మోష‌న్లు, క‌లెక్ష‌న్ల కోసం దిల్ రాజు పేరు వాడుకుని.. ఆయ‌న ప‌రువు గంగ‌లో క‌లిపేశాడు. ఇక నుంచి అయినా దిల్ రాజు త‌న బ్రాండ్ నేమ్ కాపాడుకునేందుకు ఇలాంటి చీప్ సినిమాలు వ‌దిలేస్తాడ‌ని ఆశిద్దాం..!