దిల్ రాజ్ కి షాకిచ్చిన అల్లు అర్జున్.. ఏం చేసాడో చూడండి

సుకుమార్‌ కథ సిద్ధం చేయడం లేదనే కోపంతోనో, త్రివిక్రమ్‌ చిత్రం ఆలస్యమవుతోందనే కారణంతోనో అల్లు అర్జున్‌ హడావిడిగా ‘ఐకాన్‌’ చిత్రాన్ని తన బర్త్‌డేకి అనౌన్స్‌ చేసాడు. అతను ఆ చిత్రాన్ని టైటిల్‌ లోగోతో సహా అనౌన్స్‌ చేసే నాటికే దర్శకుడు శ్రీరామ్‌ వేణు వద్ద బౌండ్‌ స్క్రిప్ట్‌ వుంది. అలాగే దిల్‌ రాజు కూడా ‘ఐకాన్‌’ని త్వరగా మొదలు పెట్టేయాలని చాలా తొందర పడ్డాడు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలు పెట్టేయడం, హీరోయిన్ల కోసం అన్వేషించడం, సంగీత దర్శకుడిగా అనిరుధ్‌తో సంప్రదింపులు జరపడం వగైరా చేసాడు.

అయితే సుకుమార్‌తో సినిమాకి అల్లు అర్జున్‌ కమిట్‌ అయి వుండడంతో ఆ కథ సిద్ధమయింది కనుక ముందుగా అది మొదలు పెట్టక తప్పదు. ఆ చిత్రం డిసెంబర్‌ లేదా జనవరిలో సెట్స్‌ మీదకి వెళుతుంది. సుకుమార్‌ చిత్రానికి కనీసం ఏడాది సమయం పడుతుంది కనుక, అందులో అల్లు అర్జున్‌ ప్రత్యేకమైన గెటప్‌తో వుంటాడు కనుక ‘ఐకాన్‌’ ప్యారలల్‌గా తీసుకునే వీల్లేదు. చూస్తోంటే ఈ కథ వేరే హీరో దగ్గరకి వెళ్లేలా వుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అల్లు అర్జున్‌ కూడా అందుకు ఓకే చెప్పేసాడని కూడా చెప్పుకుంటున్నారు.