అన్ లైన్ లో సినిమా చూసే అలావాటు ఉందా..? మీకు బిగ్ షాకిచ్చే న్యూస్

ఎంతో డబ్బు.. ఎన్నో వందల మంది కష్టం.. చాలా రోజుల శ్రమ.. ఇలా జరిగే ప్రాసెస్‌లో తయారయ్యేదే సినిమా. రెండున్నర గంటల సినిమా వెనుక ఎంత వర్క్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, ఆ సినిమా థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజే ఫలితం తేలిపోతుంది. ఫ్లాప్ అయిన సినిమాలు ఎలాగో ఆడవు. కానీ, హిట్ అయిన సినిమాలు కూడా కొన్ని శక్తుల వల్ల తీవ్ర స్థాయిలో నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అవే.. సినిమా ఇండస్ట్రీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వెబ్‌సైట్స్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పడం వెనుక కారణం ఉంది.

ఏదైనా సినిమా వచ్చి 24 గంటలు గడవక ముందే పైరసీ రూపంలో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయిపోతుంది. ముఖ్యంగా దక్షిణాదికి చెందినవి అయితే ఇంకొంచెం స్పీడుగా అప్‌లోడ్ అయిపోతున్నాయి. దీనికి కారణం సినిమా ఇండస్ట్రీని భూతంలా పట్టి పీడిస్తున్న తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌. ఈ వెబ్‌సైట్ వల్ల చిత్ర పరిశ్రమకు ఎంతో నష్టం వాటిల్లుతోంది.సినీ ఇండస్ట్రీకి ‘తమిళ రాకర్స్’ వరుస షాక్‌లు ఇస్తూనే ఉంది. సినిమా విడుదల అయిన కొన్ని గంటల్లోనే పైరసీ చేసి ఆన్‌లైన్ పెట్టేయడం వంటివి చేస్తూ ఫిల్మ్ మేకర్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్. దీనిపై ఎన్ని సార్లు నిషేదం విధించినా.. సరికొత్త అడ్రెస్‌లు సృష్టించి నెటిజన్లకు దగ్గరవుతోంది. ఈ క్రమంలోనే అన్ని భాషలకు చెందిన ఎన్నో సినిమాలను పైరసీ చేసి పెట్టేస్తున్నారు.కోట్లు ఖర్చుపెట్టి, వందలాది మంది కష్టంతో సినిమా తీస్తే, రిలీజ్ కాకుండానో.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని గంటల్లోనే పైరసీ కోరల్లో చిక్కుకుంటోంది. థియేటర్లలో కంటే ముందే ఇంటర్నెట్‌లో ప్రింట్‌ వచ్చేస్తోంది. ఇలా పైరసీ చేసే వాటిలో త‌మిళ రాకర్స్ ఒకటి. దీని అడ్మిన్ అయిన జాన్‌, కార్తీక్‌, ప్ర‌భుల‌ని గత సంవత్సరం పోలీసులు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ ఈ సైట్ రన్ అవుతుండడం గమనార్హం.అమెరికాకు చెందిన వార్నర్ బ్రదర్స్ అనే సంస్థ, యూనివర్సల్ అండ్ నెట్ ఫ్లిక్స్ సంస్థలు తమ కాపీ రైట్స్ కలిగి ఉన్న కొన్ని ప్రొగ్రాంలను ఆన్‌లైన్‌లో, ఇతర చానెళ్లలో ప్రసారం చేస్తున్నారని, వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న న్యాయస్థానం మధ్యంత తీర్పును వెల్లడించింది.

వార్నర్ బ్రదర్స్ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై వాదనలు విన్న అనంతరం ఢిల్లీ హైకోర్టు తమిళ్ రాకర్స్, ఈజెడ్‌టీవీ, క్యాట్ మూవీస్, లైమ్ టోరెట్‌ వెబ్‌సైట్‌ల యూఆర్‌ఎల్స్‌ను ఆన్‌లైన్ నుంచి తీసివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవసీని ప్రొత్సహిస్తూ, వేరే సంస్థల సమాచారాన్ని కాపీ రైట్ హక్కులకు భంగం కలిగిస్తున్నట్లు అలాంటి వెబ్‌సైట్ల రిజిస్ట్రేషన్ డొమైన్ పేరును నిషేధించాలని టెలీకమ్యూనికేషన్స్ (డీఓటీ), ఐటీ శాఖలకు మార్గదర్శకాలు జారీ చేశారు.