నిశబ్దం సినిమాకు అనుష్క రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో అనుష్క ఒకరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి లాంటి చిత్రాలతో అనుష్క రేంజ్ పెరిగిపోయింది. అనుష్క నటించిన చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టాయి. అనుష్క సినిమాలో నటిస్తే చాలు సినిమా హిట్ అవుతుందని భావించే స్థాయికి వెళ్లింది. దీనికి తగ్గట్లుగానే అనుష్క తన రెమ్యునరేషన్ ను కూడా పెంచుతూ వచ్చింది.

ఈ బొమ్మాలి తాజాగా నటించిన నిశ్శబ్దం సినిమాకు ఏకంగా రూ. మూడున్నర కోట్లు తీసుకుందన్న వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.ప్రస్తుతం అనుష్క చేతిలో పెద్దగా సినిమాలు లేవు. అయినా కూడా దక్షిణాదిలో నయనతార తర్వాత ఈ స్థాయిలో తీసుకుంటున్న నటి అనుష్క అని చెబుతున్నారు. మరి అనుష్క నిజంగానే ఇంత మొత్తంలో పారితోషకం తీసుకుoదో లేదో తెలియాలంటే చిత్ర నిర్మాతలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.