రాహుల్ ను పట్టేసిన దేవిశ్రీ.. మహేష్ సినిమాలో అదిరే ఆఫర్

బిగ్ బాస్ హౌస్‌లో వున్నప్పుడు రాహుల్ సిప్లగింజ్ మంచి పాటలు వదిలేసుకున్నాడు. అందులో ముఖ్యమైనది ”రాములో రాముల”. అల వైకుంఠపురములో చిత్రంలోని ఈ సాంగ్ ను మొదట రాహుల్ చేత పాడిద్దామనుకున్నాడు తమన్. అయితే రాహుల్ బిగ్ బాస్ హౌజ్ లో ఉండిపోవడంతో, దీపావళికి సాంగ్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అవ్వడంతో అనురాగ్ కులకర్ణి చేత పాడించాడు.రాహుల్ పాడి ఉంటే ఎలా ఉండేదో కానీ అనురాగ్ మాత్రం ఈ పాటకు పూర్తి న్యాయం చేశాడు.రాములో రాముల సూపర్ డూపర్ హిట్ అయింది.

ఆ పాట హిట్ అవ్వడానికి సింగర్, మ్యుజిషియన్, లిరిక్ రైటర్‌తో పాటు మ్యూజిక్ వీడియో కూడా ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పటిదాకా లిరికల్ వీడియోస్‌కు అలవాటు పడిన జనాలకు ఈ మ్యూజిక్ వీడియోస్ బాగా అట్ట్రాక్ట్ చేస్తోంది.అల వైకుంఠపురములో నుండి విడుదలైన రెండు పాటలకు కూడా భీభత్సమైన రెస్పాన్స్ వచ్చిన కారణంగా ఈ చిత్రంలో అన్ని పాటలు కూడా ఇలా మ్యూజిక్ వీడియోస్ చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఇప్పుడు రాహుల్‌కు ఫేమ్‌ ను క్యాష్ చేసుకునేందుకు అతని చేత పాట పాడించి మ్యూజిక్ వీడియో చేయాలని సినిమా జనాలు అనుకుంటున్నారు.తాజాగా రాహుల్‌కు మరో మంచి అవకాశం తలుపు తట్టినట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రాహుల్ చేత ఒక మంచి పాట పాడించే ప్రయత్నాల్లో ఉన్నాడట దేవి శ్రీ ప్రసాద్.