దేవిశ్రీకి బిగ్ షాక్.. హ్యాండిచ్చిన మరో క్రేజీ డైరెక్టర్

సౌత్ లో చాలా మంది దర్శకులకు, హీరోలకు దేవిశ్రీ ప్రసాద్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. అందుకే కొంతమంది దర్శకులు తమ చిత్రాలకు దేవిశ్రీని రిపీట్ చేస్తుంటారు. కానీ ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ జోరు బాగా తగ్గుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి దర్శకుల సినిమాలంటే ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించేవాడు.సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్ దేవిశ్రీ తో పనిచేయడం ఆపేశాడు. కొరటాల శివ కూడా చిరంజీవి 152 చిత్రానికి దేవిశ్రీకి అవకాశం ఇవ్వలేదు.

ఇలా వరుసగా దేవిశ్రీ చేతుల్లో నుంచి స్టార్ హీరోల చిత్రాలు చేజారుతున్నాయి. తాజాగా మరో దర్శకుడు కూడా దేవిశ్రీ ప్రసాద్ కు హ్యాండిచ్చాడు.మాస్ చిత్రాల దర్శకుడు హరి రీసెంట్ గా హీరో సూర్యతో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఇమాన్ సంగీత దర్శకుడు. దేవిశ్రీ, హరి కాంబినేషన్ లో ఆరు, యముడు, సింగం లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.హీరోల ఇమేజ్ కు తగట్లుగా మాస్ బీట్స్ అందించడంలో దేవిశ్రీ ప్రసాద్ దిట్ట. దేవిశ్రీ తన కెరీర్ లో చిరంజీవి, నాగార్జున, పవన్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలందరికీ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి.. బన్నీ, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.