డియర్ కామ్రేడ్ అసలు సీక్రేట్ ఇదే..? బయటపెట్టిన విజయ్ దెవరకొండ

నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్ అత్యంత కోలహలంగా జరిగింది. ఈ ఈవెంట్ లో విజయ్ హీరోయిన్ రష్మికతో కలిసి డాన్స్ చేయడంతో యూత్ జోష్ లోకి వెళ్ళిపోయారు.ఈ సందర్భంలో విజయ్ మాట్లాడుతూ ‘కామ్రేడ్’ అంటే ‘ప్రతి వ్యక్తి తాను ఎవరో తనను తాను తెలుసుకోవడం’ అంటూ ఈమూవీ టైటిల్ లోని అర్ధాన్ని వివరించాడు. సినిమాలలోకి రాక ముందు తాను సినిమాలకు పనికి వస్తానా లేదా అనే సంఘర్షణ ఉండేదని

ఆతరువాత హీరోగా సక్సస్ అయి ఇలాంటి డాన్స్ షోలు చేస్తున్నప్పుడు తాను స్టేజ్ పై అందర్నీ మెప్పించే విధంగా డాన్స్ చేయగలనా అన్న టెన్షన్ పడిన విషయాలను వివరిస్తూ తాను కూడ తనను తాను తెలుసుకున్నాను కాబట్టే హీరోగా రాణించగలిగాను అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడాడు.అంతేకాదు ప్రతి వ్యక్తి తనను తాను తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే వారు ఎంచుకున్న రంగాలలో రాణించ గాలుగుతారని అందువల్ల తన అభిమానులు అందరూ తాము ఏ రంగంలో రాణించగలమో ముందుగా తెలుసుకోండి అంటూ తన సందేశం ఇచ్చాడు విజయ్. అయితే విజయ్ చెప్పిన మాటలలోని భావాల కంటే డాన్స్ లకే యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.వచ్చే వారం విడుదల కాబోతున్న ఈమూవీ దక్షిణాది భాషలు అన్నింటిలోను విడుదల అవుతున్న పరిస్థితులలో

ఈమూవీ విజయం విజయ్ కెరియర్ ను మరొక మెట్టు ఎక్కించదానికి అత్యంత కీలకంగా మారింది. అందువల్లనే విజయ్ ఇలాంటి మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ ప్రధాన నగరాలు అన్నీ టూర్ చేస్తూ తాను కూడ 100 కోట్ల కలక్షన్స్ రాబట్టే స్టామినా గల హీరోని అని తెలియచేయడానికి తనవంతు ప్రయత్నాలు చాల గట్టిగా చేస్తున్నాడు..