కౌంటర్ ఇచ్చిన రాహుల్…సైలెంట్ అయిన నెటిజన్..

ప్రస్తుతం నెట్టింట్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇందులో భాగంగా మొదట్లో బిగ్ బాస్ త్రీ సీజన్ ఫైనల్స్ రోజున ఆ షో వ్యాఖ్యాత నాగార్జున ఈ ప్రైజ్ మనీతో ఏం చేస్తావ్ అని అడగగా ప్రస్తుతం తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని అందుకుగాను ఒక మంచి ఇల్లు కొనుక్కుంటానని అన్నాడు.అలాగే తన తండ్రి ఒక మంచి బార్బర్ షాప్ పెట్టిస్తానని చెప్పుకొచ్చాడు.అయితే ఇది ఇలా ఉండగా తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తన స్థోమతకు మించి ఖరీదైన బెంజ్ కార్ ని కొన్నాడు.

 

దీంతో అతడు ఈ ఫోటోలని నెటిజన్లతో పంచుకున్నాడు.దీంతో కొంత మంది నెటిజన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఒకప్పుడు నీకు సొంత ఇల్లు కూడా లేదు కదా మరి ఇప్పుడు ఇంత ఖరీదైన బెంజ్ కార్ కొనడం ఇప్పుడు అవసరమా అంటూ అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ఈ ట్రోల్స్ రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.దీంతో రాహుల్ తాజాగా ఈ విషయంపై స్పందించాడు.మీరేం టెన్షన్ పడకండి ఫ్లాట్ ఆల్రెడీ కొనేసాను. అది ఇంకా రెడీ కావడానికి ఏడు నెలలు సమయం పడుతుంది.మరియు ఫ్లాట్ కొన్న తర్వాతనే కారు కొన్నాననీ జస్ట్ ఛిల్ అంటూ తన ఫేస్ బుక్ అధికారిక ఖాతా ద్వారా స్పందించాడు.అయితే ఈ పోస్ట్ ని చూసిన రాహుల్ అభిమానులు అతనిని ట్రోల్స్ చేసేవారికి తమదైన రీతిలో సమాధానాలు ఇస్తున్నారు.బెంజ్ కార్ లో తిరగాలంటే బండిలో ఆయన ఉండాలి కానీ సొంత ఇల్లు ఎందుకు ఉండాలి దిమ్మ తిరిగే సమాధానం ఇస్తున్నారు.మరి కొంతమంది అయితే ఏకంగా బెంజ్ కారులో తిరగాలంటే సొంతిల్లు అవసరం లేదని ఒకవేళ లేకపోతే బెంజ్ కార్ స్టార్ట్ కాదా అని కౌంటర్లు ఇస్తున్నారు.