సిధ్ధార్థ్ ఏంటి ఇలా తయారయ్యాడు..

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న హీరో సిద్ధార్థ్ ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేసినా అవేవీ హిట్‌గా మారలేకపోయాయి.దీంతో వరుస ఫెయిల్యూర్ సినిమాలు చేస్తూ తెలుగులో ఫేడవుట్ అయిపోయాడు.కాగా తమిళంలో మాత్రం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తెలుగులో డబ్ చేసి వదులుతున్నాడు.తెలుగులో చాలా కాలంగా స్ట్రెయిట్ సినిమాలు చేయని సిద్ధార్థ్, ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్-2 చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో తనకు తెలుగులో మళ్లీ అవకాశాలు వస్తాయని అంటున్నాడు బొమ్మరిల్లు బాబు.

 

ఇక తెలుగులో ఓ సినిమాకు సిద్ధార్థ్ స్ర్కిప్ట్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాతో తాను తెలుగులో మళ్లీ కమ్ బ్యాక్ అవుతానని అంటున్నాడు.మరి సిద్ధార్థ్‌కు తెలుగులో ఎలాంటి కమ్ బ్యాక్ లభిస్తుందో చూడాలి అంటున్నారు తెలుగు ఆడియెన్స్.ఒకప్పుడు తెలుగులో వరుస సక్సె్ను అందుకున్న ఈ హీరో ఇప్పుడు ఒక్క సక్సెస్‌ కోసం వేచి చూస్తున్నాడు.మరి ఈ హీరో వెయిట్ చేస్తున్న ఆ సక్సెస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.