చిరు సైరాకు మరో దెబ్బ.. ఈసారి టెలివిజన్ లో

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా ఒక్కో ఇండస్ట్రీకు చెందిన అగ్ర నటుల కలయికలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదల అయ్యింది.కానీ ఒక్క తెలుగు మినహా మరెక్కడా కూడా ఊహించిన స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.ఇతర భాషల్లో ఏమో కానీ తెలుగు ప్రేక్షకులకు మరియు మెగాభిమానులకు మాత్రం ఈ చిత్ర చాలా నచ్చేసింది.

దీనితో ఈ చిత్రం స్మాల్ స్క్రీన్ పై ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నామని జెమినీ టీవీ వారు తెలియజేసారు.దీనితో ఈ వార్త విన్న అభిమానులు మాత్రం ఈసారి టీఆర్పీ రికార్డులు బద్దలవ్వడం ఖాయమని అన్నారు.కానీ ఇప్పుడు సైరా టీఆర్పీ కు దెబ్బ పడే సూచనలు ఎక్కువే కనిపిస్తున్నాయి.ఎందుకంటే నిన్ననే ఇదే జెమినీ టీవీ వారు ఇటీవల కాలంలో తాము సొంతం చేసుకున్న సినిమాలు అన్నిటిని సండే ప్రీమియర్స్ గా ప్రదర్శితం చేయనున్నామని తెలిపారు.అలా అన్ని చిత్రాలతో పాటుగా సైరా ను కూడా చూపించారు.

మాములుగా ఇలాటి ప్రిస్టేజియస్ చిత్రాన్ని మిగతా చిత్రాల్లా మాములు ఆదివారం టెలికాస్ట్ చేస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది.అందువల్ల ఏదన్నా పండుగ సమయంలో కానీ టెలికాస్ట్ చేసినట్టయతే ఖచ్చితంగా మంచి ఇంపాక్ట్ ఉంటుంది.మరి జెమినీ ఛానెల్ వారు ఏం చేస్తారో చూడాలి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.