చిరంజీవి లవ్ స్టోరీ…. ఆ రోజుల్లో ఇంత జరిగిందా…?

టాలీవుడ్ లో చిరంజీవి మెగాస్టార్ అయినా సరే ఆయన ప్రేమ వ్యవహారాలూ ఇతరత్రా వ్యవహారాలూ పెద్దగా మీడియా లో వచ్చేవి కావు. ఆయన చాలా హుందాగా వ్యవహరిస్తూ ఉండే వారు అప్పట్లో అని అంటారు. ఇప్పటికి అయినా సరే ఆయన ఎంత మందితో సన్నిహితంగా ఉన్నా సరే చాలా హుందాగా వ్యవహరిస్తూ ఉంటారని, తన పరిచయాల గురించి గాని మరొకటి గాని ఆయన బయటకు చెప్పరు అని అంటూ ఉంటారు. ఆయనకు ఒక ప్రేమ కథ ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి, చిరంజీవి అప్పట్లో టాప్ హీరోయిన్ గా ఉన్న,

రాధిక ను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు అని ప్రచారం జరిగింది. రాధిక కుటుంబంలో ఒప్పుకున్నా సరే చిరంజీవి కుటుంబ సభ్యులు మాత్రం అందుకు అంగీకారం తెలపలేదు అని సమాచారం. ఆమెకు అప్పటికే ప్రేమ వ్యవహారాలూ ఎక్కువగా ఉన్నాయని ఆమెతో ప్రేమ వ్యవహారం ఎందుకు అని చిరంజీవి ని కొందరు ఆపినట్టు వార్తలు వచ్చాయి. రాధిక చిరంజీవి పై ఎక్కువగా ఒత్తిడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని అయినా సరే కుటుంబ సభ్యుల ఒత్తిడి మీద చిరంజీవి వెనక్కు తగ్గారు అని సమాచారం.ఆ తర్వాత వీళ్ళు ఒకరితో ఒకరు అవగాహన పెంచుకుని వెనక్కు తగ్గారని తమ ప్రేమ వ్యవహారాన్ని వివాదం కాక ముందే ఈ వ్యవహారాన్ని ముగించారు అని అప్పట్లో అంటూ ఉండే వారు.

ఆ తర్వాత చిరంజీవి సురేఖ ను పెళ్లి చేసుకోవడం, అల్లు కుటుంబానికి అల్లుడు కావడం అన్నీ కూడా జరిగాయి. ఇక రాధిక మాత్రం మూడు వివాహాలు చేసుకున్నారు. ఇప్పటికి వీళ్ళ మధ్య స్నేహం అలాగే ఉంది. వీళ్ళు ఎక్కడ కనపడినా సరే సన్నిహితంగా ఉంటూ ఉంటారు. వివాదం లేకుండా దీన్ని ముగించడం తో అప్పుడు అందరూ హర్షం వ్యక్తం చేసారట.