తన తల్లి ఒంటరిగా ఉండటానికి కారణం బయటపెట్టిన చిరంజీవి

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక శిఖరం అని చెప్పవచ్చు. అయన సాధించిన అవార్డులు,రివార్డులే కాకుండా కోట్లాది మంది ప్రేక్షక దేవుళ్ళ అభిమానాన్ని పొందాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం చిరంజీవిది. వినయ విధేయతలలో ఎప్పుడు వేలెత్తి చూపించుకోలేదు. ఒక్క రాజకీయ రంగంలోనే విమర్శలు పొందారు. చిరంజీవి తన పుట్టినరోజు గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అంతేకాక తన తల్లి అంజనా గురించి కూడా చాలా విషయాలను చెప్పారు.

ఒక సాధారణ కానిస్టేబుల్ భార్య ఎలా ఉంటుందో మా అమ్మ ఇప్పటికి అలానే ఉంటుంది. ఆమె కొడుకులుగా మేము ఎంతో ఎత్తుకి ఎదిగాం. నేను గాని,తమ్ముళ్లు గాని ,చెల్లెల్లు గాని అందరం ఆర్ధికంగా బాగా స్థిరపడ్డాం. కానీ మా అమ్మ ఇప్పటికి సాధారణ గృహిణిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతుంది. కొంతకాలముగా మా అమ్మ విడిగా ఉంటుంది.దానికి రకరకాల కారణాలు ప్రచారం జరిగాయి. అలాంటి వాటిలో ఎలాంటి వాస్తవాలు లేవు. మా ఇంటిని కొత్తగా మార్పులు చేస్తున్నాం. అప్పుడు అమ్మ వేరే ఇంటిలో ఉంటానని అంది. అందుకే అమ్మను వేరే ఇంటిలో ఉంచాం. మరల అమ్మ మా ఇంటిని వచ్చేసింది. ఒంటరిగా ఉండలేకపోతున్నా అని చెప్పగానే చిన్న పిల్లవాడిలా సంబరపడిపోయాను.

అమ్మ వేరే ఉంటానని చెప్పినప్పుడు ఆ నిర్ణయాన్ని ఎంత గౌరవించామో ఇప్పుడు ఆమె తిరిగి ఇంటికి వచ్చేస్తానని చెప్పినప్పుడు అంత కన్నా ఎక్కువ సంతోషించామని చెప్పాడు. ఇది అమ్మ ఇచ్చిన పుట్టినరోజు కానుకగా భావిస్తున్నానని చిరు చెప్పారు.