చిరంజీవికి షాకిస్తున్న నాగార్జున.. దానిక్కూడా పోటీనే..!

కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో బంగార్రాజుకు స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. అతి త్వ‌ర‌లోనే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కు వెళ్ల‌నుంది. ఇందులో నాగ‌చైన‌త‌న్య కూడా న‌టిస్తున్నాడు. దీంతో సినిమాకు మ‌ల్టీస్టార‌ర్ రూపం వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో సినిమా ను సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం కింగ్ సంక్రాంతి క‌ర్చీఫ్‌ తీసేసిన‌ట్లు స‌మాచారం. బిగ్ బాస్ సీజ‌న్-3 షూటింగ్ తో పాటు, నాగ‌చైత‌న్య షెడ్యూల్ కూడా బిజీగా ఉండ‌టంతో సంక్రాంతికి సినిమా పూర్తిచేయ‌డం అసాద్య‌మని భావించిన చిత్రబృందం స‌మ్మ‌ర్ కు రిలీజ్ చేయాల‌నుకుంటున్నారుట‌.

ఇటీవ‌లే నాగార్జున మ‌న్మ‌ధుడు2 చిత్రీక‌ర‌ణ పూర్తిచేసారు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజ‌న్-3 హోస్ట్ బాధ్య‌త‌ల్లో బిజీగా ఉన్నాడు. వారానికి ఒక‌సారే తెర‌పై క‌నిపించినా సినిమా షూటింగ్ ఉంటే గంద‌ర‌గోళంగా ఉంటుంద‌ని కూల్ గా చిత్రీక‌ర‌ణ పూర్తిచేద్దామ‌ని క‌ళ్యాణ్ కు ఇటీవ‌లే చెప్పాడుట‌. ఈలోపు క‌థ‌లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసుకోమ‌ని సూచించాడుట‌. ఇక చైత‌న్య కు వ‌రుస‌గా షూటింగ్ లు ఉన్నాయి. బ‌ల్క్ గా డేట్లు కేటాయించ‌డం వీలుప‌డ‌లేదుట‌. దీంతో ఆయ‌న కూడా నాగ్ ఐడియాతో ఏకీభ‌వించిన‌ట్లు తెలుస్తోంది. ఇక సంక్రాంతి వాయిదాతో మ‌హేష్ బాబు, బ‌న్నీల‌కు లైన్ క్లియ‌ర్ అయింది. ఇప్ప‌టికే వాళ్లు సంక్రాంతి సీట్లో క‌ర్చీఫ్‌లు వేసి సిద్దంగా ఉన్నారు.

కానీ నాగ్ సినిమా రిలీజ్ అవుతుందంటే థియేట‌ర్ల స‌మ‌స్య త‌లుత్తుతోంది. తాజాగా కింగ్ ఎగ్జిట్ తో వాళ్లిద్ద‌రికీ ఉప‌శ‌మ‌నం దొరికిన‌ట్లు అయింది. ఇక చిరంజీవి- కొర‌టాల శివ సినిమా కూడా స‌మ్మ‌ర్ కు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ మాత్రం కింగ్ మెగాస్టార్ తో పోటీ ప‌డాల్సిందే. అగ్ర హీరోల చిత్రాల‌కు సెల‌వులే ఎక్కువ‌గా వ‌సూళ్లు తెచ్చిపెడ‌తాయి కాబ‌ట్టి ఏదో ఒక ఫేజ్ లో పోటీ త‌ప్ప‌దు. అదీ మ్యాట‌ర్.