చిరంజీవి ని వాడేస్తున్న విజయ్…సక్సేస్ అవుతాడా..?

తమిళ స్టార్ హీరో, దక్షిణాదిలో క్రేజ్ తెచ్చుకున్న నటుడు ఇళయదళపతి విజయ్‌… తన అభిమానులకు కొత్త సంవత్సరానికి గానూ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చారు. తన 64వ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు మాస్టర్ అనే పేరు పెట్టింది చిత్రయూనిట్. ఈ మేరకు సినిమా ఫస్ట్‌లుక్‌తోపాటు మాస్టర్‌ అనే టైటిల్‌ను సోషల్‌ మీడియాలో ప్రకటించారు.

ఫస్ట్‌లుక్‌లో మసకగా కనిపిస్తున్న విజయ్‌.. ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ సినిమాకు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి హిట్‌ సినిమా ‘మాస్టర్‌’ టైటిల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మెగాస్టార్ సినిమా కాలేజ్ బ్యాక్ గ్రౌండ్‌లో జరగగా.. ఈ సినిమా కూడా అధికభాగం కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగుతుందని తెలుస్తోంది.

మాస్టర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో నటించగా.. ఈ చిత్రంలో కూడా విజయ్‌ కాలేజీ ప్రొఫెసర్‌గా కనిపించనున్నాడు. విజయ్‌కు జోడీగా హీరోయిన్‌ మాళవిక్‌ మోహనన్‌ ఇందులో నటించనున్నారు. ‘మాస్టర్‌’ చిత్రంలో ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్ర పోషించనున్నారు. ‘మాస్టర్‌’ విజయ్‌, విజయ్‌ సేతుపతి కలిసి నటిస్తున్న తొలి చిత్రం. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.