నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా..? చరణ్ పై జక్కన్న ఫైర్

హీరోగా కన్నా నిర్మాతగా ఈ మధ్య బాగా బిజీ అయిపోయారు రాంచరణ్. సైరా సినిమా బాధ్యతలన్నీ భుజాన వేసుకున్న చెర్రీ.. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో రానున్న చిరంజీవి 152 సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఆ సినిమాపైన దృష్టి పెట్టారు. అయితే అసలు విషయాన్ని ఆయన మర్చిపోయారు. అదే జక్కన్న కళాఖండం ఆర్.ఆర్.ఆర్. సినిమాలో తను పోషిస్తున్న పాత్ర గురించి. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని రాజమౌళి ప్రకటించారు. అయితే సినిమా షూటింగ్ ఆగిఆగి నెమ్మదిగా నత్తలా నడుస్తోంది.

అందుకు కారణం తన కుమారుడు కార్తికేయ వివాహం బిజీతో పాటు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లకు షూటింగ్ సమయంలో దెబ్బలు తగలడమే. దీంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు జక్కన్న. దీనికితోడు తన సినిమాలో పాత్రల వేషధారణలోను, పద్థతుల విషయంలోను చాలా జాగ్రత్తగా ఉంటారు జక్కన్న. ఇదంతా తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫిజిక్ విషయంలో ముందున్నారు కానీ.. రాంచరణ్ బాగా వెనుకబడిపోయారట.

దీంతో జక్కన్నకు బాగా కోపమొచ్చిందట. అందుకే చరణ్‌కి ఫోన్ చేసి, చెర్రీ… నువ్వేం చేస్తున్నావో తెలుసా, ఇప్పటికైనా క్యారెక్టర్‌కు తగ్గట్లు ఫిజిక్‌ను ప్రయత్నించు. సినిమాను మనం త్వరగా పూర్తి చేయాలని చెప్పాడట. దీంతో చెర్రీ కూడా ఒకేనని.. జక్కన్నకు సారీ కూడా చెప్పాడట. అదీ సంగతి.