చంద్రబాబు సంచలనం… రెబెల్స్‌పై కొరడా!

ఎన్నికల సమయంలో టిక్కెట్ దక్కక తిరుగుబాటుకు దిగే నేతల్ని పార్టీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంది. మంచి పదవులు ఇస్తామనో లేక ప్యాకేజ్‌లు ఇచ్చో కాంప్రమైజ్ అయ్యేలా చేస్తుంది. కానీ… ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడు మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుని సంచలనం సృష్టించారు. తమ పార్టీలోనే ఉంటూ తమకే వ్యతిరేకంగా గళమెత్తుతుండడంతో ఆగ్రహించిన చంద్రబాబు.. ఆయా నేతలపై కొరడా ఝులిపించారు.

టిక్కెట్ దక్కిన అభ్యర్థులంతా ప్రచారంలో బిజీగా ఉంటే… టిక్కెట్ దక్కని వారు మాత్రం రెబల్స్‌గా పోటీ పడుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు బుజ్జగించగా… కొందరు వెనక్కు తగ్గారు. ఇంకొందరు మాత్రం తగ్గేదే లేదని మొండికేయడంతో… వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెబల్స్ వల్ల ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లు చీలి, టీడీపీ అభ్యర్థులు ఓడిపోయే పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో వారిపై చర్యలు తీసుకున్నారు.

చంద్రబాబు సస్సెండ్ చేసిన రెబల్స్ వీళ్ళే :
కడప : రాజగోపాల్ రెడ్డి
తాడికొండ : శ్రీనివాసరావు
బద్వేలు : విజయజ్యోతి
మదనపల్లె : బొమ్మనచెర్వు శ్రీరాములు
తంబళ్లపల్లె : మాధవరెడ్డి, విశ్వనాథ రెడ్డి
అవనిగడ్డ : కంఠమనేని రవిశంకర్
గజపతినగరం : కే శ్రీనివాసరావు
రంపచోడవరం : కేపీఆర్ కే ఫణీశ్వరీ