తమ్ముడిని కూడా ఇన్వాల్ చేసీన విజయ్ దెవరకొండ..

యువహీరో విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ కు తగ్గట్టే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు సాగిపోతున్నాడు. విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమాను లైన్లో పెట్టాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తోంది.ఇదిలా ఉంటే విజయ్ నెక్స్ట్ సినిమా గురించి ఫిలిం నగర్లో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

విజయ్ తన నెక్స్ట్ సినిమాలో తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి నటిస్తాడని అంటున్నారు.  అయితే ఇది పూరి సినిమా ‘ఫైటర్’ లోనా లేక మరో సినిమాలోనా అనేది మాత్రం క్లారిటీ లేదు.  ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ చిత్రంతో హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన సంగతి తెలిసిందే.  ఆ సినిమా ఫలితం నిరాశపరిచింది. ఆనంద్ నటిస్తున్న రెండవ సినిమా షూటింగ్ పెద్దగా హడావుడి లేకుండా సాగుతోంది.  అయితే విజయ్ తన తమ్ముడి కెరీర్ కు బూస్ట్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడట.  అందుకే ఇద్దరూ కలిసి నటించే ప్రపోజల్ ఉందని అంటున్నారు.

మరి ఈ సినిమాలో ఇద్దరూ ఫుల్ లెంగ్త్ హీరోలుగా నటిస్తారా లేక విజయ్ జస్ట్ అతిథి పాత్రలో నటిస్తాడా అనేది మాత్రం ఇంకా తెలియదు.  అసలు ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనా లేక దేవరకొండ బ్రదర్స్ నిజంగానే కలిసి నటిస్తున్నారా అనేది కూడా త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.