మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన ముద్దుగుమ్మ . ఆ మూడు సినిమాల్లో బంపర్ ఛాన్స్..

చిన్న సినిమాతో నటిగా పరిచయం అయిన రాశి ఖన్నా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ తో నటించే ఛాన్స్ కొట్టేస్తుంది. మొన్నటివరకు చిన్న సినిమాలకే పరిమితం అయిన రాశి ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో పెద్ద పెద్ద ఆఫర్స్ దక్కించుకుంటుంది. రీసెంట్ గా ఈమె తమిళంలో విశాల్ తో “అయోగ్య” అనే మూవీలో నటించింది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో.. విజయ్ సేతుపతితో నటించే అవకాశం కొట్టేసింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తున్న రాశి దళపతి విజయ్ 64వ చిత్రంగా తెరకెక్కనున్నచిత్రంలో కూడా ఒక హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. అలానే తెలుగులో చాలా కాలం తరువాత సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా చేస్తుంది. మారుతీ డైరెక్షన్ లో ఈమె తేజు సరసన “ప్రతిరోజూ పండుగే” సినిమాలో నటిస్తుంది. దీనితో పాటు బాబీ దర్శకత్వంలో “వెంకీ మామ”లో నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అలా ఫుల్ బిజీగా ఉన్న రాశికు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నాడు. ఈసినిమా తరువాత బన్నీ, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. అయితే ఈచిత్రంలో హీరోయిన్ గా రాశి ఫైనల్ అయిందని వార్తలు వస్తున్నాయి.

అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సిఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈసినిమా వచ్చే సమ్మర్ లో రిలీజ్ కానుంది. అలా క్షణం కూడా ఖాళీ లేకుండా ఫుల్ బిజీగా ఉంది రాశి.