ఆ స్టార్స్ ఇద్దరి లవ్ కన్ఫార్మ్.. టీజ్ చేస్తున్న అభిమానులు

అందాల హీరోయిన్లతో క్రికెటర్ల ప్రేమాయణాలు ఆల్వేస్ హాట్ టాపిక్. ప్రస్తుతం టీమిండియాలో సగం మంది ఆటగాళ్లు కథానాయికల్ని పెళ్లాడినవారే. కొందరు యంగ్ బ్యాచిలర్లు ఇప్పటికే హీరోయిన్ల ప్రేమలో బిజీ బిజీ. అందులో ట్యాలెంటెడ్ కే.ఎల్.రాహుల్ సైతం బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి గారాల పట్టీ ఆతియా శెట్టితో నిండా ప్రేమలో మునిగాడు. ఆతియాతో అతడి స్నేహం ముదిరి ఇప్పుడు ప్రేమగా మారిందన్నది రూమర్.

మేం ఇద్దరం ప్రేమలో ఉన్నాం! అని వాళ్లు ఎప్పుడూ చెప్పకపోయినా ఆ జంట షికార్లను బట్టి నెటిజనుల్లో నిరంతరం ఇదే చర్చ వేడెక్కిస్తోంది. 2019 ఫిబ్రవరి నుంచి ఈ జోడీ పలుమార్లు పార్టీల్లో కలుసుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. పార్టీలు పబ్బులు వీళ్లకు కొత్తేమీ కాదు. తాజాగా ఆతియా శెట్టి బర్త్ డేని పురస్కరించుకుని కేఎల్ రాహుల్ సామాజిక మాధ్యమాల్లో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. దాంతో పాటే ఒక కోతి ఈమోజీని షేర్ చేయడంతో ఇంకేం ఉంది అభిమానుల్లో ఒకటే వాడి వేడిగా చర్చ మొదలైపోయింది. రాహుల్ విష్ పై స్పందించిన ఆతియా .. తనకు ప్రేమ ఈమోజీల్ని షేర్ చేసింది. దీంతో ఇదే ఈ ప్రేమ గువ్వల అధికారిక ప్రకటన అంటూ రచ్చ మొదలైపోయింది. కలిసే షికార్లు చేస్తున్నారు… ఇక ప్రేమ ఖాయమైనట్టే… పెళ్లెప్పుడు? అంటూ రకరకాలుగా అభిమానులు కామెంట్లతో చెలరేగుతున్నారు.

అయితే అందాల కథానాయికలతో లవ్ ప్లే కే.ఎల్.రాహుల్ కి కొత్తేమీ కాదు. ఇంతకుముందు బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ తో అతడి స్నేహంపై రకరకాల పుకార్లు షికారు చేశాయి. లెజెండ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ తోనూ చనువుగా ఉన్నాడన్న ప్రచారమైంది. ఆకాంక్ష రంజన్ అనే మరో అందాల భామతోనూ అతడి స్నేహంపై గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు ఆతియాతో వ్యవహారం ఎంతవరకూ వెళుతుందో అసలు ఈ ప్రేమకు గ్యారెంటీ ఏమిటి! అన్న ప్రచారం మరోవైపు వేడెక్కిస్తోంది.