బర్త్ డే ట్రీట్.. అదరగొట్టిన సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా కామెడీ, రొమాంటిక్ చిత్రాల దర్శకుడు మారుతీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా “ప్రతి రోజు పండగే”. కాగా కాగా ఈ రోజు సాయి తేజ్ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ఫస్ట్ గ్లింప్స్ లవ్లీగా వేరు కలర్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా ఫీల్ గుడ్ మ్యూజిక్ తో పాటు డీసెంట్ విజువల్స్ బాగుండటంతో ఈ ఫస్ట్ గ్లింప్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ ను అలాగే పల్లెటూరి నేపథ్యాన్ని కూడా బాగా ఎలివేట్ చేసారు.

ఇక ఇటివలే ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మోషన్ పోస్టర్ ఈ చిత్రానికి మంచి పాజిటివ్ వైబ్ ను తీసుకువచ్చింది. పోస్టర్ లో తేజ్ మరియు సత్యరాజ్ రిలేషన్ బాగా హైలెట్ అయ్యేలా ఉండటం ముఖ్యంగా సత్యరాజ్ చిన్నపిల్లడిలా ఉత్సాహంగా కనిపించడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. సత్యరాజ్ ని ఈ చిత్రంలో గతానికి భిన్నంగా దర్శకుడు మారుతి ప్రెసెంట్ చేస్తున్నారట. ఇక క్రిష్టమస్ సందర్భంగా డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే బాహుబలి కట్టప్పగా పేరుగాంచిన నటుడు సత్యరాజ్ “ప్రతిరోజూ పండగే” చిత్రంలో ధరమ్ తేజ్ తాత పాత్రలో కనిపించనున్నారట.

ఈ సినిమాలో సత్యరాజ్ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తోందట. కమల్ హాసన్ హీరోగా 1978లో విడుదలైన “సత్తం ఎన్ కైయిల్” చిత్రంతో సత్యరాజ్ సినీరంగ ప్రవేశం చేసి.. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నారు. కాగా “ప్రతి రోజు పండగే” చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి తదితరులు నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు