బిగ్ షాక్.. బిగ్ బాస్ ను దాటేస్తున్న స్టార్ మా సీరియల్

ప్రస్తుతం బిగ్‌బాస్ షో అంటే తెలియని తెలుగు వారుండరు. ఎందుకంటే తక్కువ కాలంలోనే అనూహ్యమైన రేటింగ్‌ను సంపాదించుకోవడంతో ఒక్కసారిగా ఈ ప్రోగ్రాంకు క్రేజ్ పెరిగిపోయింది. అయితే గేమ్ షో లలో నంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నా ఈ షో రేటింగ్స్ మాత్రం ఆ తెలుగు సీరియల్‌ను బీట్ చేయలేకపోతుంది. బిగ్‌బాస్ ఒక్కటే కాదు తెలుగు టీవీలలో ప్రసారమయ్యే అన్నిటికన్నా మాటీవీలో సాయంత్రం 7:30 గంటలకు ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ రేటింగ్స్‌ను క్రాస్ చేయలేకపోతున్నాయి.

అయితే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి, ఎంతో కష్టపడి ప్రారంభించిన బిగ్‌బాస్ ప్రారంభ ఎపిసోడ్ టీవీఆర్ రేటింగ్ 17.9 కాగా, కార్తీక దీపం టీవీఆర్ రేటింగ్ మాత్రం 18.36 గా ఉంది. అయితే ప్రతి వారం నాగార్జున వచ్చినా కూడా దానిని రీచ్ కాలేకపోతుంది. ప్రతి వారం నాగార్జున వచ్చినప్పుడు కూడా 10-12 టీవీఆర్ రేటింగ్ మాత్రమే సంపాదిస్తుంది బిగ్‌బాస్. కానీ కార్తీక దీపం మాత్రం అలవోకగా 15.44 టీవీఆర్ రేటింగ్ సొంతం చేసుకుంటుందంటేనే చెప్పవచ్చు ఈ సీరియల్‌కు ఎంత క్రేజ్ ఉందనేది. అయితే బార్క్ రేటింగ్ లలో కూడా కార్తీక దీపం ఓ వెలుగు వెలుగుతుంది. అయితే ఒవరాల్‌గా జూలై 27 నుండి ఆగస్టు 2 వరకూ ప్రేక్షకుల ఇంప్రెషన్ లెక్కలు చూస్తే కార్తీకదీపం సీరియల్‌ 15247 పాయింట్‌లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, కోయిలమ్మ 8719, వదినమ్మ 8047, మౌనరాగం 7919, ఈటీవీ న్యూస్ 5511 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాయి.

దీనిని బట్టి చూస్తుంటే ఒక్క తెలుగు సీరియల్‌ను ఎంతో ఖర్చు పెట్టి నిర్వహించే బిగ్‌బాస్ వంటి ప్రోగ్రాం కూడా బీట్ చేయలేకపోతుందంటే కథ బాగుంటే ప్రేక్షకులకు సీరియల్స్‌ను కూడా ఎంత బాగా ఆదరిస్తారనేది చెప్పకనే చెప్పవచ్చు.