బిగ్ బాస్ ట్విస్ట్.. రాహుల్ సేఫ్ అవ్వడానికి ఆమె కారణమా..!

ఇప్పటి వరకూ మొత్తం 50 ఎపిసోడ్లలో రాహుల్ పెద్దగా పెర్ఫార్మ్ చేసింది ఏమీ లేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అయితే కేవలం పునర్నవితో నడుస్తున్న లవ్ యాంగిలే రాహుల్ ను సేఫ్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ త్రీలో లవ్ జంటగా పేరొందిన రాహుల్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ షో మొత్తానికే హైలైట్ గా నిలుస్తోంది. తాజాగా నామినేషన్స్ ఎదుర్కొన్న రాహుల్, శనివారం ఎపిసోడ్లో సేఫ్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు. నిజానికి రాహుల్ ను కాపాడింది…పునర్నవే అని సోషల్ మీడియా అంతా కోడై కూస్తోంది.

ఎందుకంటే ఇప్పటి వరకూ మొత్తం 50 ఎపిసోడ్లలో రాహుల్ పెద్దగా పెర్ఫార్మ్ చేసింది ఏమీ లేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అయితే కేవలం పునర్నవితో నడుస్తున్న లవ్ యాంగిలే రాహుల్ ను సేఫ్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాహుల్ టాస్క్ ల పరంగానూ, అలాగే బిగ్ బాస్ హౌస్ మేట్స్ తోనూ చాలా అసంతృప్తి మూటగట్టుకున్నాడు. అయితే పునర్నవితో క్లోజ్ గా ఉంటూ ఆమె మనస్సును గెలుచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని అందుకే రాహుల్ సేఫ్ అయ్యాడని సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది.