బిగ్ బాస్ లో రచ్చ.. టాస్క్ ఆడేది ఇలాగేనా..?

బిగ్ బాస్ ముఖ్యంగా రక్తికట్టేవి టాస్క్ లు. వారానికి కనీసం నాలుగు లేదా ఐదు టాస్క్ లు బిగ్ బాస్ ఇస్తాడు. లగ్జరీ బడ్జెట్ కోసం, కెప్టెన్సీ కోసం స్పెషల్ పవర్స్ కోసం ఇలా కొన్ని టాస్క్ లు జరుగుతాయి. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు చాలా లాజిక్ గా ఉంటాయి. బలం కంటే కూడా బుర్ర ఎక్కువ పెట్టి ఆడాలి. టాస్క్ ఆడటానికి ముందు టాస్క్ యొక్క రూల్స్ బాగా అర్ధం చేసుకోవాలి, అందుకు తగ్గట్లు గేమ్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి, అవసరం అయితే మధ్యలో మార్చుకోవాలి. బిగ్ బాస్ టాస్క్ అంతే స్మార్ట్ గేమ్ అని అర్ధం.కానీ ఈ సీజన్ లో ఒక్క హౌస్ మేట్ కూడా స్మార్ట్ గా టాస్క్ ఆడినవాళ్లు కనిపించటం లేదు.

టాస్క్ ఆడాలనే ఉబలాటం తప్పితే ఎలా ఆడాలి, ప్లానింగ్ ఏంటి, రూల్స్ ఏమిటి అనేది సరిగ్గా ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు. తాజాగా నిన్న జరిగిన ఈ వారం కెప్టెన్సీ టాస్క్ నేనే రాజు-నేనే మంత్రి టాస్క్ లో ఎవరు కూడా మైండ్ పెట్టి గేమ్ ఆడలేదు. ప్రతి ఒక్కరు బల ప్రయోగమే టాస్క్ అనుకున్నారు తప్ప బుర్రతో కూడా గెలవచ్చని ఎవరు అనుకోలేదు. బజర్ మోగే సమయానికి రెండు రాజ్యాల్లో ఎవరి రాజ్యంలో ఎక్కువ జెండాలు వుంటాయో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. డ్రాగన్ ఎగ్స్ తీసుకున్న వాళ్లతో సెకండ్ లెవెల్ లో పోటీ పడుతారని బిగ్ బాస్ చెప్పారు.ఈ క్రమంలో ఇరు రాజ్యాల వాళ్ళు కాసేపు జెండాల పెట్టటం కోసం పోటీపడ్డారు, ఆ తర్వాత డ్రాగన్ ఎగ్స్ కోసం పోటీ పడ్డారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఒక్క సారి డ్రాగన్ ఎగ్స్ తీసుకోని వాటిని మిస్ చేసుకుంటే టాస్క్ నుండి ఎగ్జిట్ అయిపోవాలి. ఈ క్రమంలో ఒక్కొక్కరిగా ఎగ్స్ తీసుకోవటం మరొకరు వచ్చి వాళ్ళ దగ్గర అవి లాక్కోవటం జరిగాయి. ఈ క్రమంలో హిమజ టీం లోని అందరు అవుట్ అయ్యారు. ఒక్క రవికృష్ణ మాత్రమే ఎగ్ తీసుకోని ఉన్నాడు. ఇక కేవలం శ్రీముఖి టీం లో అలీ,శ్రీముఖి ,రాహుల్ ఉన్నారు. వీళ్ళలో శ్రీముఖి,అలీ ఎగ్స్ తీసుకున్నారు. రాహుల్ ఎగ్ కోసం శ్రీముఖిపై దాడి చేసి ఎగ్ తీసుకున్నాడు.ఇక్కడ విషయం ఏమిటంటే రాహుల్ శ్రీముఖి నుండి ఎగ్ తీసుకోకపోయినా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేవాడు.

ఇరు రాజ్యలో ఎవరు లేరు ఒక్క రాహుల్ ఉన్నాడు కాబట్టి రూల్స్ ప్రకారం వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ అది పట్టించుకోకుండా టాస్క్ ఆడారు. అలాగే హిమజ టీం లో వాళ్ళు ఎగ్స్ కోసం కష్టపడ్డారు కానీ, రాజ్యంలో జెండాల ఉంచితే నెక్స్ట్ లెవెల్ కి పోతామనే ఆలోచన ఎవరికీ లేదు. ఇందులో అందరు ఆవేశంతో టాస్క్ ఆడారు తప్పితే ఆలోచనతో ఆడినట్లు లేదు.