బిగ్ బాస్ లో లవ్ ట్రాక్.. అంత దూరం తీసుకెళ్ళిందా..?

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 ఆసక్తికరంగా సాగుతుంది. మూడు వారాలు పూర్తి కావచ్చింది. ఇప్పటికే హేమ మరియు జాఫర్‌లు ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే. ఈ వారం తమన్నా ఎలిమినేట్‌ అవ్వడం ఖాయం అని అంతా అంటున్నారు..ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో పరిస్థితి చూస్తే వరుణ్‌, వితిక, రాహుల్‌, పునర్నవిలు ఒక గ్రూప్‌గా అయ్యి వారికి వారే అన్నట్లుగా ఉంటున్నారు. ఇతర సభ్యుల గురించి పెద్దగా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు.

ఇక ఈ గ్రూప్‌లో ఇప్పటికే వరుణ్‌ మరియు వితికల రొమాన్స్‌ పీక్స్‌లో ఉంది. వీరిద్దరు భార్య భర్తలు అవ్వడంతో రొమాంటిక్‌ సీన్స్‌ బాగానే కనిపిస్తున్నాయి.ఇదే సమయంలో ఇంట్లో లవ్‌ ట్రాక్‌ కూడా నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటికే పెళ్లి అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌ మెల్లగా పునర్నవికి గాలం వేస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ బిగ్‌బాస్‌ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం అవుతుంది. ఎందుకంటే డేటింగ్‌ అంటూ ప్రపోస్‌ అంటూ పునర్నవితో పదే పదే ఆ విషయాల గురించి రాహుల్‌ మాట్లాడటం జరుగుతుంది..రాహుల్‌ ఆమద్య డేటింగ్‌కు వెళ్దాం వస్తావా అంటూ పునర్నవిని ప్రశ్నించిన విషయం తెల్సిందే. ఇప్పుడు రాహుల్‌ ఒకానొక సందర్బంగా పునర్నవికి రింగ్‌ ఇచ్చి ప్రపోస్‌ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.

బయటకు వెళ్లిన తర్వాత నీకు రింగ్‌ ఇచ్చి ప్రపోస్‌ చేస్తా ఓకేనా అన్నాడు. దాంతో ఆమె పోయి పని చూసుకో అంటూ నవ్వుతూనే హెచ్చరించింది.మొత్తానికి వీరిద్దరి మద్య వ్యవహారం కాస్త ముందుకు సాగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదంతా కూడా బిగ్‌బాస్‌ స్క్రిప్ట్‌ అని అనుకునే వారు కూడా లేకపోలేదు.