బిగ్ బాస్ దెబ్బ.. ఈవారం ఎలినేట్ అయ్యేది ఏవరంటే..?

బిగ్ బాస్ ప్రతి ఎపిసోడ్ లో కూడా చాల కొత్తగా, కొత్త రకమైన గొడవలతో అందరిని అలరిస్తున్నారు. అందులో భాగంగానే ఎవరు కూడా ఊహించని పరిణామాలను ఎదుర్కొంటున్నారు ఇంటి సభ్యులు. కాగా ఎక్కువబాగా అభిమానాన్ని పెంచుకున్న కొందరు మాత్రం ఇప్పటికికూడా చాలా ఎమోషనల్ గా మారుతున్నారు. కాగా తాజాగా ఈ షో నిర్వాహకులు ఒక కొత్త ప్రోమోని విడుదల చేశారు. కాగా దాంట్లో వరుణ్, వితిక, పునర్నవి ముగ్గురు కూడా రహస్యంగా మాట్లాడుకుంటున్నారు.

కాగా ఈమేరకు మాట్లాడిన వరుణ్ సందేశ్ కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా తనకి ఏ షోలో కొనసాగడం ఇక ఇష్టం లేదని, తనకి యూఎస్ వెళ్లిపోవాలనుందని పునర్నవి తో చెబుతుండగా, మధ్యలో దూరిన వితిక మాత్రం వరుణ్ మీద కాస్త సీరియస్ అయిందని చెప్పాలి. అయితే వరుణ్ వాఖ్యలకు విసుగు వచెందిన వితిక మాట్లాడుతూ, ఇక ఆలస్యం చేయడం ఎందుకు వెంటనే ఆ గోడలు బద్దలు కొట్టేసుకొని బయటకు వెళ్ళిపో అని వరుణ్ తో చాలా చిరాకుగా అన్నట్లు కనిపిస్తుంది.

అయితే వరుణ్ మాత్రం తనని నామినేట్ చేయమని పునర్నవిని కోరతాడు. కానీ దానికి కారణం మాత్రం చెప్పలేదు. అయితే ఈ ప్రోమో చూసిన పలువురు నెటిజన్లు మాత్రం వితిక టార్చర్ వల్లే వరుణ్ బయటకు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడని సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.