బిగ్ బాస్ లో పేమెంట్స్ ఎంతో తెలుసా..? ఆ జంటకే హైయ్యెస్ట్

బిగ్‌బాస్‌ లేటెస్ట్‌ సీజన్‌లోకి జంటగా వెళ్లిన వరుణ్‌ సందేశ్‌, వితిక ఇంకా కంటిన్యూ అవుతున్నారు. వితిక కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా కానీ ఆమెకి అంత పాపులారిటీ లేదు. వరుణ్‌ భార్యగానే ఆమె అందరికీ తెలుసు. వరుణ్‌ సందేశ్‌కి ఆఫర్‌ వచ్చినపుడు అతను తన భార్య కూడా వస్తుందని చెప్పడంతో జంటగా వస్తే షోకి కొత్త డైమెన్షన్‌ వస్తుందని నిర్వాహకులు భావించారట. అందుకే వారికి ఈ సీజన్‌కి గాను ముప్పయ్‌ లక్షల పేమెంట్‌ ఇవ్వడానికి అంగీకరించారట. ఇద్దరిలో ఎవరైనా షో విజేతగా నిలిస్తే ఆ వచ్చే యాభై లక్షలు అదనం అన్నమాట.ఈ సీజన్‌లో హయ్యస్ట్‌ పెయిడ్‌ కంటెస్టెంట్స్‌ అయిన ఈ జంటని కాపాడుకోవడానికి బిగ్‌బాస్‌ నిర్వాహకులు చేయని ప్రయత్నం లేదు.

ఆరంభంలో వితికపై విపరీతమైన నెగెటివిటీ రావడంతో ఆమె వెళ్లిపోయే ప్రమాదం పలుమార్లు నెలకొంది. అప్పుడు ఆమెని ఎలిమినేట్‌ అవకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఆ తర్వాత వితికపై నెగెటివిటీ తగ్గడంతో పాటు ఇతర వీక్‌ కంటెస్టెంటులు వరుసగా ఎలిమినేట్‌ అవుతూ వుండడంతో భార్యాభర్తలు ఇంకా జంటగా కొనసాగుతున్నారు. షోలో ఏ దశలో ఎలిమినేట్‌ అయినా కానీ వరుణ్‌ జంటకి, శ్రీముఖికి, పునర్నవికి ముందుగా మాట్లాడుకున్న పేమెంట్‌ ఇచ్చేయాలి. మిగతా వారికి వారానికి ఇంత అని ఇస్తారు. అందుకే శ్రీముఖి, పునర్నవిని కాపాడుకోవడానికి కూడా బిగ్‌బాస్‌ అంతగా తపించిపోతున్నది.