మరో వైల్డ్ ఎంట్రీ.. బిగ్ బాస్ కు అమె రాబోతుందా..?

చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఈ వారం ఎవరు బిగ్‌బాస్‌ ఇంటి నుండి బయటకు వస్తారు అంటే ఠక్కున తమన్నా పేరు చెప్పారు. అంతా అన్నట్లుగానే, చెప్పినట్లుగానే తమన్నా బయటకు వచ్చేసింది. ఆమె ప్రవర్తన ఆమె ఎలిమినేషన్‌కు కారణం అయ్యింది..ట్రాన్స్‌ జెండర్స్‌ అంటే మరీ ఇలా ఉంటారా అనుకునేలా చేసింది. ఏదో సాధించాలని వెళ్లిన తమన్నా తన పరువు తానే తీసుకుని వచ్చేసింది. అత్యంత నీచమైన ప్రవర్తన అంటూ విమర్శలు ఎదుర్కొన్న తమన్నా ఎలిమినేట్‌ అవ్వడంతో ఇంటి సభ్యులు మరియు ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.

మొదటి వారం తర్వాత హేమ ఎలిమినేట్‌ అవ్వగా ఆమె స్థానంలో తమన్నా ఎంట్రీ ఇచ్చింది. హేమ తర్వాత జాఫర్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. 15 రోజులు కూడా లేకుండానే తమన్నా ఎలిమినేట్‌ అయ్యింది. ఇక ఇంట్లో 13 మంది మిగిలారు. వచ్చే వారం మరో వ్యక్తి లేదా ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది. అలాగే వచ్చే వారం మరో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హెబ్బా పటేల్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. .వచ్చే వారం ఎలిమినేషన్స్‌ తర్వాత అంటే సోమవారం నాడు ఎపిసోడ్‌లో హెబ్బా పటేల్‌ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.మాట వర్గాలు కూడా ఈ విషయాన్ని అనధికారికంగా నిర్ధారిస్తున్నాయి.

ఈవారంలోనే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇప్పించాలని భావించినా కూడా ఇక ఇదే చివరి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ కనుక నాల్గవ లేదా అయిద వారంలో అయితే బాగుంటుందని భావించారు.అందుకే వచ్చే వారంకు వైల్డ్‌ ఎంట్రీని వాయిదా వేయడం జరిగింది.