బిగ్ బాస్ దెబ్బ.. వరుణ్ ను ఇరికించేసిన వితిక

బిగ్‌బాస్‌ అనేది ఇండివిడ్యువల్‌ గేమ్‌ అయినా కానీ వరుణ్‌ సందేశ్‌, వితిక జంటని హౌస్‌లోకి పంపించి అడిషినల్‌ ఫుటేజ్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసారు. వీరిద్దరూ జంటగా ఆడడం మిగిలిన వారికి పలుమార్లు డిజట్వాంటేజ్‌ అయింది. అయితే ఈ జంటని విడగొట్టడానికి తరచుగా వితికని నామినేషన్లలో పెట్టడంలో మిగతా కంటెస్టెంట్లు విఫలమయ్యారు. దీంతో ఆమె లేకుండా ఆడడానికి వరుణ్‌ అలవాటు పడలేదు. ఇప్పుడదే అతడిని డేంజర్‌లో పెడుతోంది.గత వారం వితికని నామినేషన్స్‌నుంచి కాపాడడానికి రాళ్లే రత్నాలు టాస్క్‌లో వరుణ్‌ కావాలని ఓడిపయాడు. వితిక ఆ అవకాశాన్ని వినియోగించుకుని మెడాలియన్‌ టాస్క్‌లో చివరి వరకు వెళ్లిపోయింది. చివర్లో బాబాని రిక్షాలోంచి అన్యాయంగా తోసేసి మెడాలియన్‌ దక్కించుకుంది.

దీంతో ఆమెపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ మెడాలియన్‌ టాస్క్‌ గెలిచినందుకు గాను వితిక ఒకసారి నామినేషన్ల నుంచి తప్పించుకునే వెసులుబాటు లభించింది. దానిని ఆమె ఈవారం వాడేసుకుంది. దీంతో ఆమెపై వున్న వ్యతిరేకత అంతా వరుణ్‌పై రబ్‌ అవుతోంది. కొన్ని వారాలుగా ఓటింగ్‌లో టాప్‌లో వుంటోన్న వరుణ్‌కి ఈసారి గెలవడం కష్టమయ్యేలా వుంది.తనతో పాటు నామినేట్‌ అయిన వారిలో రాహుల్‌కి ఇండివిడ్యువల్‌ ఫాలోయింగ్‌ వుంది. పైగా ఇప్పుడు పునర్నవి ఫాన్స్‌ సహకారం కూడా లభిస్తుంది. మహేష్‌ విట్టాకి బాబా భాస్కర్‌, శ్రీముఖి సపోర్టర్స్‌ ఓట్స్‌ వేస్తున్నారు. దీంతో వితికపై వున్న వ్యతిరేకత వరుణ్‌ మెడకి చుట్టుకుంది. ఈసారి నామినేట్‌ అవడం డేంజర్‌ అనేది వరుణ్‌కి కూడా తెలుసు. అందుకే ఎప్పుడు నామినేట్‌ అయినా తేలిగ్గా తీసుకునేవాడు కాస్తా ఈసారి కంగారు పడుతున్నాడు.

భార్యతో కలిసి చివరి వరకు గ్రూప్‌ గేమ్‌ ఆడేయాలని చూడడం టైటిల్‌ ఫేవరెట్‌ అనుకున్న వాడినే రిస్కులో పెట్టిందిపుడు. ఇదిలావుంటే తొలిసారిగా ఈ సీజన్‌ హోస్ట్‌ నాగార్జున హౌస్‌లోకి వెళుతున్నాడు. దసరా సందర్భంగా కంటెస్టెంట్స్‌తో ఆయన కాసేపు సరదాగా గడిపారు. బంగార్రాజు గెటప్‌లో నాగార్జున హౌస్‌లోకి మంగళవారం ఎపిసోడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు.