ఖమ్మంలో శ్రధ్ధా దాస్ కి షాక్… చుక్కలు చూపించారు.

డిసెంబర్ 31 రాత్రి వివిధ కార్యక్రమాల్లో డాన్స్ చేసేందుకు, ప్రత్యేక అతిథిగా హాజరయ్యేందుకు హీరోయిన్లకు భారీగా ఆఫర్లు వస్తుంటాయి. స్టార్ హీరోయిన్ల నుంచి చిన్న హీరోయిన్ల వరకు అంతా ఇలాంటి ఆఫర్లకు ఓకే చెబుతుంటారు. కత్రినాకైఫ్ లాంటి తారలైతే ఒక్క రాత్రి డాన్స్ చేసేందుకు కోట్లలో తీసుకుంటారు. అలాంటి ఓ ఆఫర్ ను శ్రద్ధా దాస్ కూడా ఒప్పుకుంది. కానీ ఆమెకు రాత్రి చేదు అనుభవం ఎదురైంది.

ఖమ్మంలో సాయంత్రం ఓ క్లబ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంగీకరించింది శ్రద్ధా దాస్. ఓ రిసార్ట్ కు సంబంధించిన ప్రచార కార్యక్రమం అది. తమ క్లబ్ కు ప్రచారం కల్పించడం కోసం నిర్వహకులు శ్రద్ధా దాస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో శ్రద్ధా దాస్ తీవ్ర అసౌకర్యానికి గురైంది. ఓ హీరోయిన్ లా ఆమెను ట్రీట్ చేయకుండా, రిసార్ట్ కు వచ్చిన వ్యక్తులతో పాటు కలిపేయడంతో అంతా ఒక్కసారిగా ఆమె చుట్టూ గుమిగూడారు. ఒక దశలో శ్రద్ధా దాస్ వ్యక్తిగత సిబ్బంది కలుగజేసుకోవాల్సి వచ్చింది.

సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు వాళ్ల భద్రతను చూసుకోవాల్సిన బాధ్యత నిర్వహకులదే. అవసరమైతే ఈ విషయంలో పోలీసుల సహాయం కూడా తీసుకోవాలి. కానీ రాత్రి మాత్రం శ్రద్ధదాస్ విషయంలో అలాంటి చర్యలు పెద్దగా తీసుకున్నట్టు కనిపించలేదు. అసలు ఆమె పట్టణంలోనికి రావడంతోనే జనాలు ఎగబడ్డారు.

అప్పుడే శ్రద్ధాదాస్ కాస్త అనుమానపడింది. అయితే తర్వాత జరిగిన కార్యక్రమానికి కూడా ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడంతో శ్రద్ధా దాస్ కు చుక్కలు కనిపించాయి. ఖమ్మంలో రాత్రి జరిగిన కార్యక్రమంలో శ్రద్ధాదాస్, కొన్ని హిట్ సాంగ్స్ కు డాన్స్ చేసింది. తర్వాత కేక్ కట్ చేసి ఖమ్మంవాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పింది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.