అల్లు అరవింద్ కు బిగ్ షాక్.. భారీ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసిన రాం చరణ్

అల్లు అరవింద్ 15 వందల కోట్లతో నిర్మించబోయే ‘రామాయణం’ మూవీ ప్రాజెక్ట్ గురించి వార్తలు రెండు సంవత్సరాల క్రితమే వచ్చాయి. అయితే ఆ తరువాత అంత భారీ ప్రాజెక్ట్ వర్కౌట్ కాదు అన్న ఉద్దేశ్యంతో అరవింద్ ఈమూవీ ప్రాజెక్ట్ ఆలోచనలు విరమించుకున్నాడు. అయితే అనూహ్యంగా ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఏకంగా 15 వందల కోట్ల భారీ బడ్జెట్ తో ప్రకటింప బడటమే కాకుండా ఈ ప్రాజెక్ట్ కు ‘దంగల్’ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ వార్తలు రావడం పెను సంచలనంగా మారింది. పూర్తి గ్రాఫిక్స్ తో నిర్మింపబడే ఈమూవీ మూడు భాగాలుగా నిర్మాణం జరుపుకో బోతోంది.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇంత భారీ బడ్జెట్ మూవీ నిర్మాణం ఎప్పుడు జరగలేదు. ఇలాంటి భారీ ప్రాజెక్ట్ లో రాముడు పాత్రను చేయవలసిందిగా అరవింద్ మొట్టమొదటి ఆఫర్ రామ్ చరణ్ కు ఇచ్చినా ఆ ఆఫర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చరణం సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రాజెక్ట్ లో నటించే అవకాసం కోసం ఎంతో వ్యూహాత్మకంగా ప్రవర్తించిన చరణ్ ఇప్పుడు తన కాంపౌండ్ కు వచ్చిన ఇలాంటి భారీ ప్రాజెక్ట్ ను ఎందుకు వదులుకున్నాడు అంటూ అప్పుడే చర్చలు మొదలైపోయాయి. శ్రీరాముడు పాత్రకు తాను సరిపోనని చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడా లేదంటే ఇలాంటి భారీ ప్రాజెక్ట్ లో ఇరుక్కుంటే సంవత్సరాలు గడిచిపోతాయి అని భయపడ్డాడా అంటూ ఎవరి స్థాయిలో వారు ఊహాగానాలు చేస్తున్నారు.

చరణ్ తిరస్కరణతో అరవింద్ ఇప్పుడు ఒక బాలీవుడ్ క్రేజీ హీరోతో ఈ ప్రాజెక్ట్ విషయమై ప్రాధమిక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం..