బిగ్ షాక్.. బిగ్ బాస్ వ్యూహం రివర్స్ అయ్యిందా..?

ఈసారి హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్‌లో బిగ్‌బాస్‌కి పెద్దగా అవసరం లేని వాళ్లు కొందరున్నారు. వారిలో యూట్యూబ్‌ కమెడియన్‌ మహేష్‌ విట్టా ఒకడు. అతడిని ఎలాగైనా ఎలిమినేట్‌ చేయాలని బిగ్‌బాస్‌ చాలా సార్లు ప్రయత్నించాడు కానీ అతడికంటే వీక్‌ వున్న కంటెస్టెంట్స్‌ కూడా నామినేషన్లలో వుండడంతో మహేష్‌ సేవ్‌ అవుతూ వచ్చాడు. మైండ్‌ గేమ్స్‌ ఆడుతూ, ప్రేక్షకుల నాడిని అంచనా వేసే వారిలో మహేష్‌ ఒకడు. అందుకే నామినేషన్స్‌లో వున్నపుడు, తాను ఎలిమినేట్‌ అవుతాననే భయం కలిగినపుడు అతడు డ్రామా క్రియేట్‌ చేస్తూ వుంటాడు.

దీంతో అతడిని ఎలిమినేట్‌ చేయడానికి బిగ్‌బాస్‌ ఈసారి వరుణ్‌ సందేశ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌లాంటి ఫాలోయింగ్‌ వున్నవాళ్లతో నామినేషన్లలో నిలబెట్టాడు. అయితే శ్రీముఖి, బాబా భాస్కర్‌ లాంటి మరొకరు ఎవరైనా కూడా నామినేషన్లలో వుంటే మహేష్‌ ఎలిమినేషన్‌ ఈజీ అయ్యేది. రాహుల్‌, వరుణ్‌ ఫ్రెండ్స్‌ కావడంతో ఆపోజిట్‌ గ్రూప్‌ నుంచి మహేష్‌కి ఓట్లు పడుతున్నాయి. దీని వల్ల ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది చెప్పడం కష్టంగా వుంది. మరో మూడు రోజుల పాటు ఓటింగ్‌ కొనసాగుతుంది కనుక ఈలోగా ఎవరికి అయినా ముప్పు వుండొచ్చు.

రాహుల్‌, వరుణ్‌ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్‌ అయితే మరొకరు ఫైనల్స్‌కి సూపర్‌ స్ట్రాంగ్‌ అయిపోతారు. బిగ్‌బాస్‌ నిర్వాహకులకి అది జరగడం ఇష్టం లేదు. వీరిద్దరితో నామినేషన్లలోకి పంపిస్తే మహేష్‌ ఈజీగా ఎలిమినేట్‌ అవుతాడని అనుకుంటే ఆ స్ట్రాటజీ రివర్స్‌ కొట్టేలా కనిపిస్తోంది. పదకొండు వారాల పాటు ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఈజీగా తెలిసిపోతూ వచ్చింది కానీ ఈసారి ఎవరు ఎలిమినేట్‌ అయ్యారనేది అఫీషియల్‌గా లీక్‌ అయితే కానీ తెలిసేలా లేదు.