చిరుకు బిగ్ షాక్.. అందుకు నో చెప్పేసిన సుకుమార్

మెగాస్టార్ చిరంజీవి సినిమాల స్పీడు పెంచాడు. ఇటీవల భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి తదుపరి చిత్రాలను వరుసగా లైన్‌లో పెడుతున్నాడు. సైరా సెట్స్‌ మీద ఉండగానే కొరాటల శివ దర్శకత్వంలో నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు చిరు. ఈ సినిమాను కూడా చిరు తనయుడు రామ్‌ చరణ్‌ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్ లుక్‌లో కనిపించేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు చిరు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో చిరు సరసన సీనియర్‌ హీరో త్రిష నటించనుందన్న టాక్‌ వినిపిస్తోంది. మరో హీరోయిన్‌గా తెలుగమ్మాయి ఈషారెబ్బ పేరు వినిపిస్తోంది. అదే సమయంలో మెగాస్టార్‌ సరసన హ హ హాసిని జెనిలాయ నటిస్తున్న వార్త కూడా తాజాగా మీడియా సర్కి్ల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది.ఈ సినిమా తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టాడు మెగాస్టార్‌. మాలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన లూసీఫర్‌ సినిమాను తెలుగులో చిరు హీరోగా రీమేక్‌ చేయనున్నారు. ఇప్పటికే రామ్‌ చరణ్‌ లూసీఫర్‌ హక్కులను కూడా సొంతం చేసుకున్నాడు. స్టైలిష్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రీమేక్‌ను క్రియేటివ్‌ డైరెక్టర్ సుకుమార్‌ తో డైరెక్ట్‌ చేయించాలని భావించారు.

అయితే లూసీఫర్‌ రీమేక్‌ను తెరకెక్కించేందుకు సుకుమార్‌ నో చెప్పాడు. రంగస్థలం తరువాత లాంగ్‌ గ్యా్ప్‌ తీసుకున్న సుకుమార్‌ మహేష్ బాబుతో ఓ సినిమాను ప్లాన్‌ చేశాడు. అయితే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్‌ అవ్వటంతో ఇప్పుడు అల్లు అర్జున్‌ హీరోగా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్న బన్నీ ఆ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్‌ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో మెగా టీం లూసీఫర్‌ రీమేక్‌కు దర్శకుడిగా ఎవరి ఎంచుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.