బిగ్ బ్రేకింగ్.. సుశాంత్ తో నివేదా పెళ్ళి..

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అనేది సర్వ సాధారణం. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో మరో టాపిక్ హాట్ హాట్‌గా నడుస్తోంది. నిజంగానే ఇప్పుడు అల్లు వార‌బ్బాయి అక్కినేని హీరోకు బావ అవుతున్నాడు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అక్కినేని కుటుంబంలో ఎవ‌ర్నైనా త‌మ ఇంటికి బంధువులుగా మార్చుకుంటున్నారా అనిపిస్తుంది. కానీ అలాంటిదేం లేదు. మరి ఏమిటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు.

ఈ చిత్రం షూటింగ్ కూడా స‌గం పూర్త‌యింది. ఈ కాంబినేషన్‌లో ఇప్ప‌టికే వ‌చ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి విజయం సాధించడంతో ఇప్పుడు వ‌స్తున్న మూడో సినిమాపై కూడా భారీ అంచ‌నాలున్నాయి. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అక్కినేని మేన‌ల్లుడు సుశాంత్ కూడా కీలక పాత్ర‌లో న‌టిస్తున్నాడు.సుశాంత్ న‌టిస్తున్న పాత్ర పూజా హెగ్డేకు అన్న‌య్య గా చెబుతున్నారు. ఆ లెక్కన చూస్తే, బ‌న్నీకి బావ అయిపోతున్నాడు. ఈ చిత్రంలో సుశాంత్ చెల్లితో బ‌న్నీ ప్రేమ‌లో ప‌డ‌తాడు. అలాగే బ‌న్నీకి కూడా ఓ చెల్లి ఉంటుంది. ఆమె ఎవరంటే, నివేదా థామ‌స్.

ఈమెతో సుశాంత్ ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇలా ఒకరి చెల్లిని మరొకరు చేసుకుంటే,కుండ‌మార్పిడి అన్న‌మాట‌. త్రివిక్ర‌మ్ ఇలా కొత్తగా క‌థ అల్లాడ‌ని తెలుస్తోంది. ఈ ఇద్ద‌రి పెళ్లిళ్ల‌పైనే ఆస‌క్తిక‌ర‌మైన స్క్రీన్ ప్లేతో క‌థ అల్లేసాడ‌ని టాక్ నడుస్తోంది.