బాలయ్య నెక్స్ట్ సినిమా టైటిల్ ఫిక్స్.. అధిరిపోయే రేంజ్ లో

సింహా, నరసింహ, సమరసింహా, చిత్రాలు బాలయ్య కెరియర్ లోనే మంచి హిట్ చిత్రాలు. ఆ పేరులో‌ ఉండే ‘సింహా’ అనే పదం బాలయా కి చాలా కలిసివచ్చింది. మన టాలీవుడ్ సింహం ఈసారి కూడ సింహం పేరుతోనే రాబోతున్నారు.కథానాయకుడు , మహానాయకుడు సినిమాల తరువాత బాలకృష్ణ కే.ఎస్. రవి కుమార్ దర్శకత్వంలో ఇప్పుడు ఒక సినిమా నటిస్తున్నారు. సినీ సమాచారం‌ ప్రకారం‌ దానికి బాలయా కి బాగా కలిసి వచ్చిన ‘సింహా’ పదం‌ ఉండేలాగా ‘రాయలసింహ’ అనే పెరు పెట్టాఅని అలోచిస్తున్నట్టు సమాచారం.

వాస్తవానికి ‘రూలర్’ అని NBK105 సినిమాకు టైటిల్‌ను పరిశీలిస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి , కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది, ఇది బాలకృష్ణను మళ్ళీ ఒక బలమైన మాస్ పాత్రలో చూపిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ డైలాగులు మరియు గ్రిప్పింగ్ యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉండే అవకాశం ఉందని టాక్. ఇది బి మరియు సి సెంటర్లలో దూసుకుపోవడానికి సహాయపడుతుంది. NBK105 లో సోనాల్ చౌహాన్, వేధిక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.కె.ఎస్ రవికుమార్ మరియు బాలకృష్ణ గతంలో ‘జై సింహా’ కోసం కలిసి పనిచేశారు. ఇది గత సంవత్సరం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

నయనతార నాయకురాలిగా నటించిన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకున్నప్పటికీ మంచి కలెక్షన్ అందుకుంది.ఈ మూవీలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అని టాక్, సింహా లో‌ తనతో‌ పాటు నటీంచిన ఓ హీరోయిన్ గా నటించిన నమిత అనే ఇందులో కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుందని ఊహాగానాలు. హాట్ హీరోయిన్ నమిత మరియు బాలయ్య సెంటిమెంటు కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది