బాలయ్య కథతోనే సినిమా..? సరిలేరు నీకెవ్వరు పై షాకింగ్ అప్ డేట్..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనే కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే మొదట ఈ కథను దర్శకుడు వేరే హీరోలతో అనుకున్నట్లు టాక్ వస్తోంది.గతంలో అనిల్ బాలకృష్ణతో ఒక సినిమా చేయాలనీ అనుకున్నాడు.

కళ్యాణ్ రామ్ తో పటాస్ కథ హిట్టావ్వగానే బాలకృష్ణ నుంచి ప్రశంసలు అందుకున్న అనిల్ అనంతరం బాలయ్య కొరికే మేరకు రామారావు గారు అనే ఒక కథను రెడీ చేశాడు.అయితే బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ పై ద్రుష్టి పెట్టి అప్పుడు అనిల్ ని పట్టించుకోలేదు. దీంతో అదే కథలో కొన్ని మార్పులు చేసి మహేష్ కోసం సరిలేరు నీకెవ్వరు గా మార్చినట్లు తెలుస్తోంది.గతంలోనే ఈ వార్తలు వచ్చినప్పటికీ రామారావు కథ మహేష్ తో చేస్తున్న స్క్రిప్ట్ చాలా డిఫరెంట్ అని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ దర్శకుడు అదే కాన్సెప్ట్ ను మహేష్ సినిమాలో వాడుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Hyderabad: Savithri movie audio launch held at JRC Convention Centre in Hyderabad (Photo: IANS)