టాలివుడ్ స్టార్ నిర్మాత కు టైం బ్యాడ్…

టాలీవుడ్ స్టా్ర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమాను నిర్మించాడంటే ఆ సినిమా ఖచ్చితంగా చూసే తీరాలి అనే ముద్ర వేసుకున్నారు.డిస్ట్రిబ్యూటర్‌గా అపారమైన అనుభవం ఉన్న ఆయన ఎలాంట సినిమాను నిర్మిస్తే లాభాలు వస్తాయో అవలీలగా నిర్ణయించగలరు అనే భావన ఇండస్ట్రీ జనాల్లో ఉంది.అయితే ఈ మధ్య ఆయనకు టైం కలిసి రావడం లేదు.దీనికి తాజాగా వచ్చిన రెండు సినిమాలే ఉదాహరణగా నిలిచాయి.

 

దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా ఫేడవుట్ అవుతున్న హీరో రాజ్ తరుణ్‌ను పెట్టి అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండేతో ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే రొమాంటిక్ చిత్రం తెరకెక్కింది.అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.ఈ సినిమాలో యూత్‌ను ఆకట్టుకునే అంశాలు లేకపోవడం, సినిమా చాలా బోరింగ్‌గా ఉండటంతో సినిమాను చూసేందుకు జనం భయపడ్డారు.ఇక కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమాను తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేశాడు.ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లకు మంచి స్పందన రావడంతో ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని దిల్ రాజు అనుకున్నాడు.కానీ ఈ సినిమా విషయంలోనూ దిల్ రాజు లెక్క తప్పింది.ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు అంటే ఈ సినిమా ఎలాంటి పరాభావాన్ని మూటగట్టుకుందో చెప్పేయొచ్చు.

 

ఇలా స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు ఒకప్పుడు వరుసబెట్టి ఏడాదిలో ఆరు సినిమాలను సక్సెస్ చేసిన ఘనత ఉన్నప్పటికీ, గ్రహచారం బాగా లేకపోవడంతో బ్యాక్‌ టు బ్యాక్ రెండు ఫ్లాప్ సినిమాలను మూటగట్టుకున్నాడు.మరి ఈ ఫ్లాపుల నుండి దిల్ రాజు ఎలా తేరుకుంటాడో చూడాలి అని అంటున్నారు సినీ క్రిటిక్స్.