బాబా భాస్కర్ ను అలా టార్గేట్ చేసేసిందేంటి..? పుణర్నవి సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ కి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. హౌస్ లో ఉన్నంత సేపు వాళ్ళపై ఎంత అభిమానం చూపిస్తారో అందరికీ తెలుసు. అయితే వాళ్ళు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక ఇంట్లో జరిగే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి పలు ఛానల్స్ వారి వెంటపడుతుంటాయి. అయితే ఆ ఇంటర్వ్యూలని కూడా జనం ఎగబడి చూస్తుంటారు. బిగ్ బాస్ వల్ల కంటెస్టెంట్స్ కి కూడా పాపులారిటీ పెరుగుతుంది.మొన్న ఆదివారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన పునర్నవి ఒకానొక ఇంటర్వ్యూలో హౌస్ మెంబర్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలని వెల్లడించింది. ముఖ్యంగా ఆమె బాబా భాస్కర్ గురించి మాట్లాడటం అందరినీ షాక్ కి గురి చేసింది.

బాబా భాస్కర్ …భాస్కర్ కాదని మాస్కర్ అని..ఆయన ఇంట్లో ఎప్పుడూ నటిస్తూనే ఉంటాడని, డబల్ గేమ్ ఆడుతున్నాడని.. నిజానికి ఆయన అసలు రూపం వేరే ఉందని చెప్పింది.అయితే ఇక్కడే పునర్నవి తప్పు చేసిందని భావిస్తున్నారు. ఇంట్లో ఉన్న డెబ్భై రోజులు బాబా భాస్కర్ నటించాడని అనడం ఎంత వరకు కరెక్టో అర్థం కాలేదు. ఒకవేళ బాబా అలా నటించి ఉంటే, ఆ విషయం ఇంట్లో ఉన్నప్పుడే చెప్పాలి కదా…పోనీ కనీసం ఎలిమినేట్ అయ్యాకనైనా స్టేజీ మీద చెప్తే బాగుండేదని అంటున్నారు. స్టేజి మీద మాట్లాడేటపుడు అందరూ మంచివాళ్ళే అన్నట్టు మాట్లాడి, బాబా భాస్కర్ ని సైతం పొగుడుతూ, ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటం సరికాదని విమర్శిస్తున్నారు.

అదీ గాక బాబా భాస్కర్ మంచివాడే అని చెప్తూ… బిగ్ బాంబ్ ని అతని మీదకే విసిరింది. దీనివల్ల ఆమె డబల్ గేమ్ ఆడుతుందని అర్థమవుతుంది. బాబా భాస్కర్ ఏం చేస్తున్నాడని పునర్నవి అనుకుంటుందో పునర్నవినే అలా ప్రవర్తించడం వింతగా అనిపించింది.