అతడికి హ్యాండ్ ఇచ్చిన అనుష్క… టాలివుడ్ లో చర్చ

తమిళంలో ఇటీవల రిలీజ అయ్యి ఘన విజయం సాధించిన చిత్రం ‘అసురన్’.ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సూపర్ హిట్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యి పలు భాషల్లో రీమేక్ అయ్యేందుకు రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాను తెలుగులోనూ స్టార్ హీరో వెంకటేష్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే.ఈ రీమేక్ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండటంతో టాలీవుడ్ వర్గాలు షాక్‌కు గురయ్యాయి.

బ్రహ్మోత్సవం వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్‌ సినిమాతో మాయమైన శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు ‘అసురన్’ వంటి మాస్ కంటెంట్ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడా అని అందరూ అనుకుంటున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరైతే బాగుంటుందా అని అందరూ అనుకుంటుండగా స్వీటీ అనుష్క శెట్టి పేరు వినిపించింది.దీంతో ఆమెను చిత్ర యూనిట్ సినిమాలో నటించాల్సిందిగా సంప్రదించారు.అయితే కారణం ఏమిటో తెలియదు కాని అనుష్క మాత్రం ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట.

వెంకటేష్‌తో ఇప్పటికే రెండు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడెందుకు రిజెక్ట్ చేసిందో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.ఏదేమైనా వెంకటేష్ లాంటి హీరోతో సినిమాను రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ్ హల్‌చల్ చేస్తోంది.