అచ్చంగా బాహుబలిని ఫాలో అయ్యి బోల్తా పడతారా..?

బాహుబలి చిత్రంతోనే క్యారెక్టర్‌ పోస్టర్లని విడుదల చేయడమనే ట్రెండ్‌ మొదలయింది. బాహుబలి విజయం అందించిన స్ఫూర్తితో మొదలయిన భారీ చిత్రాలలో ఒకటి ‘పానిపట్‌’. ఆశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో అర్జున్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రమోషన్స్‌ చూస్తే బాహుబలికి ఏమేమి చేసారో చూసుకుని చేస్తున్నట్టుంది. పోస్టర్లు, పోస్టర్లకి వాడిన రంగులు, క్యారెక్టర్‌ స్కెచ్‌లు అన్నీ కూడా బాహుబలిని తలపిస్తున్నాయి.

ఈ చిత్రం ట్రెయిలర్‌కి యూట్యూబ్‌లో ముప్పయ్‌ అయిదు మిలియన్ల వ్యూస్‌ వచ్చినా కానీ ఆశుతోష్‌ గోవారికర్‌ గత చిత్రాన్ని బట్టి దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొహంజుదారో చిత్రాన్ని ఆ స్థాయిలో చెడగొట్టడంతో ఆశుతోష్‌పై ఎవరికీ నమ్మకం లేదు. అయితే జోదా అక్బర్‌, లగాన్‌ లాంటి చిత్రాలు తీసింది కూడా అతనే కనుక ఆశుతోష్‌ని తక్కువ అంచనా వేయడానికి లేదు.కాకపోతే లో కాన్ఫిడెన్స్‌ వల్ల ఈ చిత్రం ప్రమోషన్లలో క్రియేటివిటీ చూపించలేక బాహుబలిని కాపీ కొడుతున్నారనే అపప్రదని మూటగట్టుకుంటున్నారు. ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌, క్రితి సనన్‌ లాంటి పాపులర్‌ స్టార్స్‌ అయితే వున్నారు కానీ ప్రేక్షకులని ఎంతవరకు మెప్పిస్తుందో విడుదలయితే తప్ప క్లారిటీ రాదు.