జనాలను పిచ్చోళ్ళను చేసారుగా.. అందరి ముందే కొట్టుకున్న స్టార్ హీరో, డైరెక్టర్

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుని వెళుతున్నాడు. ప్రస్తుతం దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో సూర్యవంశీ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు హీరో మధ్య గొడవలు వచ్చాయి అంటూ ఓ మీడియా సంస్థ గాసిప్ కథనాన్ని ప్రచురించింది. దీన్ని సరదాగా నిజం చేసి చూపించారు అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి.

కత్రినా కైఫ్ వీడియోను ప్రెజెంట్ చేస్తూ.. ఆ న్యూస్ ను చదివింది. వెంటనే అక్షయ్ కుమార్-రోహిత్ శెట్టి కెమెరా ముందుకు వచ్చి కొట్టుకోవడం మొదలుపెట్టారు. కొందరు పట్టుకొని వారిని విడదీశారు. చివరికి కింద పడిపోయారు ఇద్దరూ..! అలా ఆ న్యూస్ ను నిజం చేస్తూ వాళ్ళు వీడియోను అప్లోడ్ చేశారు. అయితే ఇదంతా కామెడీగా జరిగిన ఘటనే..! మేమంతా బాగున్నాం.. మీరే అనవసరమైన రూమర్స్ స్ప్రెడ్ చేయకండి అని రోహిత్-అక్షయ్ లు ఇలా హితవు పలికారు. నవ్వుతెప్పించే ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.