అడ్డంగా బుక్కయిన అనసూయ.. ఆటాడుకుంటున్న నెటిజన్స్

విజయ్ దేవరకొండ ని స్టార్ చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘అర్జున్ రెడ్డి’ ఎంత హిట్ అయ్యిందో అంతే విమర్శలను కూడా ఎదుర్కొంది. ఈ సినిమాలో వాడిన బూతు పదాలపై అప్పట్లో చాలా చర్చ జరిగింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై నడిచిన చర్చలు ఇంక ఏ సినిమా మీద జరగలేదు. ట్రైలర్ కే ఇన్ని విమర్శలను ఎదుర్కొన్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక విమర్శలు బాగా పెరిగిపోయాయి.

ఈ సినిమాను విమర్శించిన వారిలో ముందుగా యాంకర్ నటి అనసూయ ముందు వరసలో ఉంటది. సోషల్ మీడియా వేదికగా ఆమె అప్పట్లో ఈ సినిమాను చీల్చి చెండాడింది. చాలా డిబేట్స్ లో కూడా ఆమె ఈ సినిమాను విమర్శించింది. దీంతో ఆమెను కూడా విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ తన స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి తనకి సోలో హీరోగా మొదటి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మెయిన్ రోల్ గా ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే… ‘అర్జున్ రెడ్డి’ సినిమా టైములో తనపైనా సినిమా పైనా దుమ్మెత్తి పోసిన అనసూయ ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేయడం.

విజయ్ ఫ్యాన్స్ తమ హీరోని అంతలా విమర్శించిన ఆమెకు విజయ్ తన సినిమాలో ఎలా ఛాన్స్ ఇచ్చాడని అనుకుంటున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో అనసూయ కూడా పాల్గొంటుందని అంటున్నారు. ఈ ప్రమోషన్స్ లో ఆమె పాల్గొంటే ఆమెను ఇంటర్వ్యూ చేసే వాళ్ళు మొదట అడిగే ప్రశ్న ‘అప్పట్లో విజయ్ ని విమర్శించారు కదా.. ఇపుడు అతను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో ఎలా నటిస్తున్నారు’ అని. దీనికి ఆమె ఏం చెప్తుందో అని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.