అతిపెద్ద రిస్క్ చేస్తున్న అనసూయ.. ఇప్పుడు అంత అవసరమా..?

సినిమా నిర్మాణం అంటే మామూలు మాటలు కాదు. పెద్దపెద్ద నిర్మాతలే ఆరిపోయారు ఇండస్ట్రీలో. అందుకే పిచ్చి క్రేజ్ వున్నా… సినిమా నిర్మాణం అంటే ఆమడ దూరం పరిగెడతారు నటీనటులు. ఎందుకంటే ఇక్కడ లాభాలు కంటే నష్టాలే అధికం. నిర్మాతగా ఒక్క సినిమా పల్టీ కొడితే వంద సినిమాల్లో సంపాదించిన డబ్బు పోతుంది. ఈ రిస్క్ చేసే చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే యాంకర్ కం యాక్టర్ అనసూయ నిర్మాతగా మారుతుందట. తన అభిరుచి తగ్గట్టు కధలతో సినిమాలు తీస్తుందట. దిని కోసం అనసూయ పిక్చర్స్ అనే అనే బ్యానర్ ని కూడా రిజిస్టర్ చేసిందట. యాంకర్ గా నటిగా బాగానే సంపాదించింది అను. మరి ఇప్పుడు నిర్మాణం అంటే కొంచెం రిస్కే.