అంతా నానికోసమేనా..? కావాలనే గ్యాంగ్ లీడర్ క్లైమాక్స్ ను మార్చారా..?

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన `గ్యాంగ్ లీడ‌ర్‌` డివైడ్ టాక్ మూట‌గ‌ట్టుకుంది. విక్ర‌మ్ కె.కుమార్ మ్యాజిక్ ప‌నిచేయ‌లేద‌ని, ద్వితీయార్థం ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌లేక‌పోయాడ‌ని విశ్లేష‌కులు తేల్చేశారు. దాంతో బాక్సాఫీసు ద‌గ్గ‌ర గ్యాంగ్ లీడ‌ర్ విడైడ్ టాక్ మూట‌గ‌ట్టుకుంది. క్లైమాక్స్ విష‌యంలో విక్ర‌మ్ మ‌రీ రొటీన్‌గా ఆలోచించ‌డాని సాధార‌ణ ప్రేక్ష‌కులు సైతం ఫీల్ అవుతున్నారు.మాస్ హీరోకి త‌గ్గ ఫైట్‌తో ఈ సినిమాకి శుభం కార్డు వేశాడు ద‌ర్శ‌కుడు. అది కూడా మైన‌స్ గానే మారింది.

అయితే… క్లైమాక్స్ విష‌యంలో విక్ర‌మ్ త‌ప్పేమీ లేద‌ని టాక్‌. ఈ సినిమా కోసం విక్ర‌మ్ ఓ వైవిధ్య‌భ‌రిత‌మైన క్లైమాక్స్‌నే రాసుకున్నాడ‌ట‌. త‌న తెలివితేట‌ల‌తోనే శ‌త్రువుని అంత‌మొందించిన‌ట్టు క్లైమాక్స్‌ని డిజైన్ చేశాడ‌ట‌.అయితే సినిమాలో అప్ప‌టి వ‌ర‌కూ ఒక్క ఫైట్ కూడా లేద‌ని, క్లైమాక్స్‌ని కూడా అలా సింపుల్‌గా ముగిస్తే ఈ సినిమా మాస్‌కి చేరువ కాక‌పోవ‌చ్చ‌న్న భ‌యంతో నాని క్లైమాక్స్‌ని మార్చి రాయ‌మ‌న్నాడ‌ట‌. నాని కోసం విక్రమ్ క్లైమాక్స్‌ని మార్చాల్సివ‌చ్చింది. విక్ర‌మ్ కొత్త త‌ర‌హా క్లైమాక్స్ తో ఈ సినిమాని ముగించి ఉంటే, ఫ‌లితం కాస్త బెట‌ర్ అయ్యేదేమో..?