నందమూరి ఫ్యాన్స్ కు పగటి కలే..? మోక్షజ్ఞ విషయంలో ఊహించని ట్విస్ట్

బాల‌య్య ప్ర‌స్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. మహానాయకుడు దారుణంగా పరాజయం తర్వాత ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. బాల‌య్య ప్ర‌స్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. మహానాయకుడు దారుణంగా పరాజయం తర్వాత ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాంతో పాటు తనయుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి కూడా ఆలోచిస్తున్నాడు ఈయన. వారసుడి కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్నారు అభిమానులు. ఎందుకంటే నంద‌మూరి కుటుంబం నుంచి ఒక‌టి రెండు కాదు.. 13 ఏళ్ళైపోయింది కొత్త హీరో వ‌చ్చి. ఇప్ప‌టికీ అదే క‌ళ్యాణ్ రామ్.. అదే ఎన్టీఆర్.. అదే బాల‌య్య ఇండ‌స్ట్రీని దున్నేస్తున్నారు.

వాళ్లు కాకుండా ఈ కుటుంబం నుంచి కొత్త మొహాలు రాలేదు.మ‌రోవైపు అంద‌రి కుటుంబాల నుంచి వార‌సులు ఒక్కొక్క‌రుగా వ‌స్తూనే ఉన్నారు. గ‌త ప‌దేళ్ల‌లో వెల్లువ‌లా ఒక్కో ఫ్యామిలీ నుంచి ముగ్గురు న‌లుగురు వార‌సులు కూడా వ‌చ్చారు. మెగా ఫ్యామిలీ అయితే త‌మ కుర్రాళ్ల‌తో ఇండ‌స్ట్రీని నింపేసింది. దాంతో ఇప్పుడు నంద‌మూరి కుటుంబం మాత్ర‌మే బ్యాలెన్స్ ఉండిపోయింది. ఈ లోటు భ‌ర్తీ కావాలి అంటే ఇప్పుడు ఈ కుటుంబం నుంచి రావాల్సిన వార‌సుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ స‌న్ ఆఫ్ నంద‌మూరి బాల‌కృష్ణ‌. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు.. తాత‌కు తగ్గ మ‌న‌వ‌డు అనిపించుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ కుర్రాడు. ఇప్ప‌టికే 23 ఏట అడుగు పెట్టాడు మోక్షు.

దాంతో ఇప్పుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని ఇప్పుడు నంద‌మూరి అభిమానులు బాల‌య్య‌ను ప్ర‌శ్నిస్తున్నారు. పైగా ఆయనకు సినిమాలంటే ఆసక్తి లేదని.. బిజినెస్ వైపు అడుగేస్తున్నాడంటూ ఈ మధ్య కొన్ని వార్తలు కూడా వచ్చాయి. దాంతో బాలయ్య ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దీనికి స‌మాధానంగా బాల‌య్య కూడా ఇప్పుడు అభిమానులకు సమాధానమిచ్చినట్లు తెలుస్తుంది. తన వారసుడు ప్రస్తుతం చదువులతో బిజీగా ఉన్నాడని.. అది పూర్తైన తర్వాత సినిమాలు చేస్తాడని క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కచ్చితంగా నటనలోకి వస్తాడని.. బిజినెస్ లాంటివి ఏముండవంటూ అభిమానులకు బాలయ్య మాటిచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే బాలయ్య చెప్పినట్లు మాత్రం అక్కడేమీ జరగట్లేదు. మోక్షు ప్రస్తుతం ఓవర్ వెయిట్‌తో ఉన్నాడు. ఈ మధ్య విడుదలైన ఫోటోలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. దాంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.. అసలు ఈయనకు నటనంటే ఆసక్తి ఉందా లేదా అంటూ అనుమానపడుతున్నారు కూడా. కానీ బాలయ్య మాత్రం అలాంటి అనుమానాలేవీ పెట్టుకోవద్దంటూ భరోసా ఇస్తున్నాడు. కచ్చితంగా వస్తాడు కానీ ఇప్పట్లో మాత్రం కాదని క్లారిటీ ఇచ్చాడు నందమూరి నటసింహం. ఈయన నటిస్తున్న రూలర్ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది.